Homeక్రైమ్మంచుకొండల్లో విషాదం.. హిమపాతంలో దిగ్గజ పర్వతారోహకుడు నిమ్స్‌దాయ్ మృతి

మంచుకొండల్లో విషాదం.. హిమపాతంలో దిగ్గజ పర్వతారోహకుడు నిమ్స్‌దాయ్ మృతి

క్రైమ్ మిర్రర్ : ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాల్లో ఒకటైన బ్రాడ్ పీక్‌పై సంభవించిన భారీ హిమపాతం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ “నిమ్స్‌దాయ్” పుర్జాతో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ధృవీకరించారు. ఈ ఘటనతో అంతర్జాతీయ పర్వతారోహణ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన వివరాలను నిమ్స్‌దాయ్‌కు చెందిన అడ్వెంచర్ సంస్థ ‘ఎలైట్ ఎక్స్‌పెడ్’ తన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. హిమపాతంలో నిమ్స్‌దాయ్‌తో పాటు ఆయన గైడ్‌లు పూర్ బహదూర్ గురుంగ్, నిమా షెర్పా సహా మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు తెలిపింది.

నేపాల్‌కు చెందిన నిర్మల్ పుర్జా ప్రపంచ పర్వతారోహణ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ప్రపంచంలోని 14 అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించి అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆయన సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్తంగా సాహస క్రీడల అభిమానులకు స్ఫూర్తిగా నిలిచాయి. అలాంటి గొప్ప పర్వతారోహకుడు హిమపాతంలో ప్రాణాలు కోల్పోవడం పర్వతారోహణ రంగానికి తీరని లోటుగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు పర్వతారోహకులు, క్రీడా సంస్థలు, అభిమానులు నిమ్స్‌దాయ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
also read : వరుసగా అస్వస్థతకు గురైన విద్యార్థినులు.. దెయ్యం వదంతులతో భయాందోళనలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు