Homeక్రైమ్మాదాపూర్‌లో యువకుడి ఆత్మహత్య...!

మాదాపూర్‌లో యువకుడి ఆత్మహత్య…!

  • మాదాపూర్‌లో యువకుడి ఆత్మహత్య

  • అయ్యప్ప సొసైటీలో భవనం టెర్రస్‌ నుంచి దూకిన యువకుడు

హైదరాబాద్, మాదాపూర్: మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో ఓ యువకుడు భవనం టెర్రస్‌ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. తీవ్ర గాయాల కారణంగా యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతానికి చెందిన కలమట యశ్వంత్‌ (23), కలమట రమేష్‌ కుమారుడు. యశ్వంత్‌ గత సెప్టెంబర్‌ 2 నుంచి మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని అవాసా కో-లివింగ్‌లో గది నంబర్‌ 206లో నివాసం ఉంటున్నాడు. జనవరి 2026 నుంచి డెలాయిట్‌ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం.

మంగళవారం ఉదయం యశ్వంత్‌ అస్వస్థతకు గురయ్యాడు. వైరల్‌ జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే నిర్ధారణ కోసం డాక్టర్‌ సూచన మేరకు రక్త నమూనాలను పరీక్షలకు ఇచ్చినట్లు తెలిసింది.

Youth commits suicide in Madhapur
Youth commits suicide in Madhapur

అనంతరం మధ్యాహ్నం సుమారు 3:08 గంటల సమయంలో యశ్వంత్‌ భవనం టెర్రస్‌పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకినట్లు సమాచారం. తీవ్ర గాయాల కారణంగా అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

యశ్వంత్‌ ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు