Homeతెలంగాణతెలంగాణలో జనసేన...!

తెలంగాణలో జనసేన…!

  • మొన్న హైదరాబాద్.. నిన్న ఖమ్మంలో..

  • చాప కింద నీరులా పార్టీ విస్తరణ

  • కార్పొరేషన్ ఎన్నికలపై గురి..

  • సార్వత్రిక ఎన్నికలే టార్గెట్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో జనసేన దూకుడు పెంచుతోంది. ఖమ్మంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. దాదాపు 5వేల మందితో సాగింది ఈ ర్యాలీ. ప్రధానంగా వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఆవిర్భవించాలని భావిస్తోంది. నిర్దిష్టమైన ఓటు బ్యాంకును పొందాలని ఆలోచన చేస్తోంది.

ముఖ్యంగా ఏపీ సరిహద్దు జిల్లాలపై జనసేన ప్రభావం అధికంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఒంటరిగానే ముందుకు వెళ్లాలని చూస్తోంది. బిజెపి పిలిస్తే జతకట్టేందుకు కూడా జనసేన సిద్ధపడుతోంది.

ఏపీలో బిజెపితో జనసేన జత కట్టిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీని కలుపుకొని సూపర్ విక్టరీని సాధించింది. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.

  • అంతా వ్యూహం ప్రకారం..

జనసేన ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోంది తెలంగాణలో. మొన్న ఆ మధ్యన హైదరాబాదులో కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది. ముందుగా మున్సిపల్ ఎన్నికలను టార్గెట్ చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తో పాటు ప్రధాన నగరాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

వాటిలో ప్రభావం చూపిస్తే చాలు.. వచ్చే ఎన్నికల నాటికి నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉన్నట్లు జనసేన నాయకత్వం అంచనా వేస్తోంది. పెద్ద పెద్ద నాయకులను పార్టీలో చేర్చుకోవడం కంటే.. విద్యాధికులను, సమాజ సేవకులను పార్టీలోకి రప్పించేందుకు ఆలోచన చేస్తోంది. అటువంటి వారికి కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేట్ టికెట్లు ఇచ్చి.. కనీస స్థాయిలో గెలుపు అవకాశాలను పదిలపరుచుకోవాలని చూస్తోంది.

  • ఏపీ ప్రభావంతో..

ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉంది జనసేన. పవన్ కళ్యాణ్ ఒక బాధ్యతగా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రజల్లో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. ఆ ప్రభావం తెలంగాణ పై కూడా ఇప్పుడు పడుతుంది. దీనికి తోడు సినీ అభిమానం ఉంటుంది. పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మెగా అభిమానులు తెలంగాణలో అధికం. అందుకే దూకుడుగా రాజకీయాలు చేయడం కంటే.. చాప కింద నీరులా తెలంగాణలో విస్తరించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాదులో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.

ఇప్పుడు ఖమ్మం, వరంగల్, నల్గొండ లాంటి జిల్లాల్లో కూడా ఊపందుకుంటున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన ఉనికి చాటుకుంటే.. ఒకటి రెండు చోట్ల ప్రభావం చూపితే దాని ఎఫెక్ట్ కచ్చితంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలపై పడుతుంది.

పవన్ ఆలోచన కూడా అదే. 2014 నుంచి ప్రయత్నాలు ప్రారంభిస్తే 2024 కు సక్సెస్ అందుకున్నారు. అందుకే ఏపీ ఫార్ములాను తెలంగాణలో అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు