-
తెలంగాణలో వేగం పెంచాలని నిర్ణయం
-
సోషల్ మీడియా మరింత బలోపేతం
-
ఆకాష్ కొల్లూరు కు బాధ్యతలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయ దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారు కల్వకుంట్ల కవిత. పార్టీని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లేందుకు గట్టి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని మరింత విస్తరించాలని భావిస్తున్నారు.
డిజిటల్ మీడియాతో పాటు సోషల్ మీడియా బాధ్యతలను ఆకాష్ కొల్లూరు కు అప్పగించారు. జర్నలిజం విభాగంలో పేరు మోసిన సంస్థల్లో పనిచేశారు ఆకాష్ కొల్లూరు. ఇటీవల తెలంగాణ రక్షణ సేనలో చేరారు.
ఇప్పుడు ఆయనకు టిఆర్ఎస్ సోషల్ మీడియా బాధ్యతలను కట్టబెట్టారు కవిత. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టేందుకు సిద్ధపడుతున్నారు.
-
బలమైన జిల్లాలపై ఫోకస్..
తెలంగాణలో బలమైన జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలనుకుంటున్నారు కవిత. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఒకలా.. ప్రభుత్వ వైఫల్యాలు, ఇతరత్రా అంశాలు పనిచేసే జిల్లాల్లో మరోలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇతర పార్టీలకు చెందిన పేరు మోసిన నాయకులు టిఆర్ఎస్ లో చేరకపోవడం చాలా పెద్ద లోటు.
అయినా సరే క్షేత్రస్థాయిలో రాజకీయాలు చేసేందుకు కవిత సిద్ధపడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయోజనాల కోసం.. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి అయి తీరుతానని ఆమె గంటాపథంగా చెబుతున్నారు. ఇందుకుగాను సుదీర్ఘ వ్యూహాలను రూపొందిస్తున్నారు.
అందులో భాగంగానే సోషల్ మీడియాను మరింత బలోపేతం చేస్తున్నారు. త్వరలో ఆమె వ్యూహకర్తలను నియమించుకునే అవకాశం ఉంది. బలమైన ప్రజా పోరాటాలకు కూడా ఆమె వ్యూహరచన చేస్తున్నారు.
-
అంచనాలకు భిన్నంగా..
కవిత పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత భారీగా చేరికలు ఉంటాయని అంతా అంచనా వేశారు. కానీ ఇంతవరకు పెద్ద స్థాయి నాయకుడు ఆ పార్టీలో చేరలేదు. భారత రాష్ట్ర సమితి నాయకత్వం కవిత పార్టీ విషయంలో ముందుగానే జాగ్రత్త పడింది. పార్టీ శ్రేణులు అటువైపు వెళ్ళకుండా కట్టడి చేయగలిగింది.
అటు కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఆ పార్టీ నాయకులు ఇటువైపు వచ్చే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న బలమైన సంకల్పం ఆ పార్టీలో ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో మిగిలిన నేతల కోసం కవిత ప్రయత్నాలు చేశారు.
కానీ అవి ఏవి వర్కౌట్ కాలేదు. అందుకే క్షేత్రస్థాయిలో తెలంగాణ సమాజంలో బలం పెంచుకోవాలన్న ఆలోచనలో కవిత ఉన్నారు. అందుకే పార్టీకి అవసరమైన అన్ని రకాల వనరులను సమకూర్చుకుంటున్నారు.
