రోజూ ఉదయం అనుకున్న సమయానికి కచ్చితంగా మేల్కొనేందుకు చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్లను లేదా మొబైల్స్‌ను అలారమ్‌గా వాడుతుంటారు. అయితే, నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను తల దగ్గర్లో లేదా బెడ్‌పైనే ఉంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో హానికరమని ఆరోగ్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మొబైల్‌ను ఎప్పుడూ కాస్త దూరంగా టేబుల్ లేదా కప్‌బోర్డ్‌పై ఉంచాలని సూచిస్తున్నారు.చెవికి అతి సమీపంలో ఉండి సడన్‌గా పెద్ద శబ్దంతో అలారం మోగడం వల్ల నిద్రలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఉలికిపడి లేవాల్సి వస్తుంది. ఈ తరహా ఆకస్మిక భయాలు మరియు ఒత్తిడి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి,రక్తపోటు పెరగడంతో పాటు క్రమంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో ఈ దుష్ప్రభావాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ దౌత్య విధానంపై చైనా ప్రశంసలు..!
ఈ అనారోగ్య సమస్యల నుంచి రక్షించుకోవడానికి నిపుణులు కొన్ని సులువైన చిట్కాలు ఇస్తున్నారు. ఫోన్‌ను బెడ్‌కు దూరంగా ఉంచడంతో పాటు, ఉదయం లేవడానికి చిన్న సౌండ్‌తో ప్రారంభమై క్రమంగా శబ్దం పెరిగే (Gradually increasing volume) రింగ్‌టోన్స్‌ను అలారమ్‌గా సెట్ చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల శరీరం ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా మేల్కొనవచ్చు.
లైనప్‌పై అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. ఇక బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు!
