Homeతెలంగాణమీర్పేట్ టీఎస్ఆర్ నగర్ ఫేజ్-2లో నీటి కోసం నిత్యం యుద్ధమేనా..?

మీర్పేట్ టీఎస్ఆర్ నగర్ ఫేజ్-2లో నీటి కోసం నిత్యం యుద్ధమేనా..?

  • మీర్పేట్ టీఎస్ఆర్ నగర్ ఫేజ్-2లో నీటి కోసం నిత్యం యుద్ధమేనా..?

  • ప్రతిరోజూ తాగునీటి కోసం అవస్థలు…!

  • సమస్యను పరిష్కరించాలంటున్న స్థానికులు ఆవేదన

క్రైమ్ మిర్రర్, మీర్‌పేట్ (హైదరాబాద్): మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని TRS నగర్ ఫేజ్-2లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, అవసరమైన స్థాయిలో నీటి సరఫరా జరగడం లేదని ప్రజలు వాపోతున్నారు.

ఇళ్లలో నిత్యావసరాలకు అవసరమైన నీరు అందకపోవడంతో మహిళలు, వృద్ధులు సహా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. నీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.

  • ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఎందుకు?

TRS నగర్ ఫేజ్-2లో నీటి సమస్యకు అసలు కారణం ఏమిటన్నది అధికార యంత్రాంగం స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. పైప్‌లైన్ సమస్యా..? నీటి సరఫరాలో అంతరాయమా..? లేక సరిపడా నీటి సరఫరా లేకపోవడమా..? అనే విషయాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ ఎదురవుతున్న నీటి ఇబ్బందులకు తక్షణ చర్యలు తీసుకుని, నిరంతర నీటి సరఫరా అందేలా చూడాలని కోరుతున్నారు. ప్రజల ఇబ్బందులు అధికారుల దృష్టికి చేరుతాయా..? సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుంది..? అన్నది వేచి చూడాల్సి ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు