-
మేనల్లుడు చిన్న శ్రీను దూరం కావడంతో ఆవేదన
-
వైసీపీ సమావేశంలో ఘటన
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి బొత్స ఏడ్చారు. కార్యకర్తల సమావేశంలోనే బోరున విలపించారు. తన మేనల్లుడు చిన్న శ్రీను తనను నమ్మించి మోసగించాడంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చీపురుపల్లి నియోజకవర్గ వైసీపీ శ్రేణుల సమావేశంలో ఒక్కసారిగా నిర్వేదానికి గురయ్యారు బొత్స.
కన్నీటి పర్యంతం అయ్యేసరికి సమావేశంలో ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇటీవల బొత్స ఇది రెండవసారి ఏడవడం. గతంలో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన తల్లిని దూషించారంటూ గుర్తు చేశారు మంత్రి అచ్చం నాయుడు. ఆ సందర్భంలో రాను అలా అనలేదని ఏడ్చారు. ఇప్పుడు తన మేనల్లుడు తనకు దెబ్బేశాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ బోరునవ్వులపించారు.
-
పార్టీ శ్రేణులతో అత్యవసర భేటీ..
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న చిన్న శ్రీను వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని గరివిడిలో పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు బొత్స. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు, గెలుపోటములు, సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కొన్న బొత్స.. ఇలా కన్నీరు పెట్టుకోవడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.
జిల్లాలో తన కుడి భుజంగా ఉండేవారు మేనల్లుడు చిన్న శ్రీను. కేవలం విజయనగరం జిల్లాలో మాత్రమే కాదు విశాఖ జిల్లాలో సైతం పార్టీ వ్యవహారాలతో పాటు కుటుంబ రాజకీయాలను నడిపారు. కానీ ఉన్నట్టుండి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిపోయారు. ఇది బొత్స కు షాక్ కలిగించే విషయం.. కనీసం ఊహించని పరిణామం.
-
కుటుంబంలో చీలిక..
అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం కుటుంబంలో వచ్చిన చీలికతోనే చిన్న శ్రీను టిడిపి వైపు అడుగులు వేసినట్లు అర్థం అవుతోంది. కుటుంబం కోసం తాను అండగా నిలబడితే తన వారసులకు అవకాశాలు లేకుండా పోతున్నాయి అన్న ఆవేదనతోనే చిన్న శ్రీను బయటపడినట్లు అర్థమవుతుంది. అయితే తన మేనల్లుడు తన నుంచి విడిపోవడానికి మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు బొత్స.
పైకి మాత్రం పార్టీలు శాశ్వతం.. మనుషులు వస్తుంటారు పోతుంటారు అని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు కానీ.. అంతర్గతంగా ఆయన తీవ్ర వేదనకు గురవుతున్నారని అర్థం అవుతుంది. చిన్న శ్రీను బయటకు వెళ్లిపోయిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా విరుద్ధ ప్రచారం చేసింది.
బొత్స ఉండగా చిన్న శ్రీను ఎవరని.. బొత్స బలం చూసుకునే అంతలా రెచ్చిపోయేవారని.. అసలు చిన్న శ్రీను బయటకు వెళ్ళిపోతే పట్టించుకునేది ఎవరు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. కానీ బొత్స మాత్రం నీరుగారిపోవడంతో వైసీపీ శ్రేణుల్లో డీలా కనిపిస్తోంది. నమ్మకం సన్నగిల్లుతోంది.
