Homeఆంధ్ర ప్రదేశ్నగిరి నుంచి రోజా ఔట్...!

నగిరి నుంచి రోజా ఔట్…!

  • వచ్చే ఎన్నికల్లో అక్కడ బీసీ అభ్యర్థి

  • గట్టి ఆలోచనతో జగన్

  • అందుకే పార్టీ కార్యక్రమాలకు మాజీ మంత్రి దూరం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి రోజా ఎందుకు కనిపించడం లేదు? సినిమాలతో పాటు బుల్లితెరపై ఆమె బిజీ అయ్యారా? లేకుంటే పొలిటికల్ యాక్టివిటీస్ తగ్గించారా? ఇప్పుడు దీనిపైనే విస్తృత చర్చ నడుస్తోంది. వైసీపీలో ఆమెకు అవకాశాలు లేక వెనక్కి తగ్గారన్న టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా ఈసారి నగిరి టిక్కెట్ ఆమెకు ఇచ్చేందుకు జగన్ వెనుకడుగు వేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అదే విషయం ఆమెకు తెలియక… పార్టీ కార్యక్రమాలను తగ్గించినట్లు బయట ప్రచారం సాగుతోంది.

  • మొన్నటి ఎన్నికల్లో మొండి చేయి..

మొన్నటి ఎన్నికల్లోనే ఆమెకు నగిరి టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం నడిచింది. దానికి కారణం నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రధాన నేతలతో ఆమెకు విభేదాలు ఉన్నాయి. పైగా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది.

అయితే సిట్టింగ్ మంత్రిగా రోజాకు టిక్కెట్టు ఇవ్వకపోతే.. తప్పుడు సంకేతాలు వెళ్తాయని జగన్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే అప్పట్లో ఆమెకు టికెట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఆమె వైఖరిలో మార్పు రాలేదని తెలుస్తోంది.

ఇప్పటికీ ఆ సీనియర్ నేతలతో ఆమె సఖ్యత పెంచుకోలేదని హై కమాండ్ కు నివేదికలు వచ్చినట్లు సమాచారం. అక్కడ టిడిపి దూకుడుకు కళ్లెం వేయాలంటే బీసీ వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం తెలిసి రోజా పార్టీకి దూరం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

  • అప్పట్లో ఫైర్ బ్రాండ్..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉండేవారు రోజా. అయితే వైసిపి ఓటమికి రోజా లాంటివారు కారణం అని చాలామంది సీనియర్లు బాహటంగా వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఆమెను జగన్ దూరం పెట్టినట్లు కూడా ప్రచారం సాగుతోంది. టిడిపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రోజా రెండు సార్లు ఆ పార్టీ ద్వారా పోటీ చేసి ఓడిపోయారు.

వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. మూడుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచారు. 2019లో గెలిచిన రోజాకు మంత్రి పదవి కూడా ఇచ్చారు జగన్. అయితే ఆమె వివాదాస్పదముద్రను వేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమె సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు