Homeతెలంగాణరామాయణ నుంచి వినాయక చవితి స్పెషల్.. జై జై రామ్ తో భక్తి వైబ్స్...!

రామాయణ నుంచి వినాయక చవితి స్పెషల్.. జై జై రామ్ తో భక్తి వైబ్స్…!

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: బాలీవుడ్‌లో ప్రస్తుతం భారీగా చర్చ జరుగుతున్న చిత్రాల్లో రామాయణ ఒకటి. భారతీయ ఇతిహాసాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపిస్తుండగా.. సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తున్నారు. యష్ రావణుడిగా కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

Also Read|:పీర్జాపూర్‌లో వినాయకుడి నిమజ్జనం.. పూజలు కూడా చేయకుండానే గణనాథుడికి వీడ్కోలు

ఇప్పటికే రామాయణ కు సంబంధించిన కొన్ని విజువల్స్, ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటికి మంచి స్పందన రావడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ప్రేక్షకులకు ప్రత్యేకమైన కానుక అందించింది. సినిమాలోని తొలి పాటగా జై జై రామ్ ను విడుదల చేసింది. ఈ పాటకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించడం విశేషం. అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ తమ స్వరాలతో పాటకు ప్రాణం పోశారు. హిందీ వెర్షన్‌కు కుమార్ విశ్వాస్ సాహిత్యం అందించారు. ఎ.ఆర్. అమీన్ మ్యూజిక్ సూపర్‌వైజర్‌గా పనిచేశారు. భక్తి భావాన్ని ప్రతిబింబించేలా సాగిన ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది.

Also Read:‘హనుమాన్ అంశ్’పై యువ సహ నిర్మాత క్లారిటీ.. నా పెట్టుబడి అంతే!

జై జై రామ్ లిరికల్ వీడియోలో రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలను చూపించారు. రణబీర్ కపూర్‌ను శ్రీరాముడిగా, సాయి పల్లవిని సీతగా చూపించిన సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాటలోని సంగీతానికి తగ్గట్టుగా విజువల్స్‌ను అందంగా కట్ చేయడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ పాటపై స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రామాయణ మొదటి భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 2026 నవంబర్ 6న పార్ట్-1 థియేటర్లలోకి రానుంది. భారీ తారాగణం, అద్భుతమైన విజువల్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ‘జై జై రామ్’ పాట మరింత హైప్ తీసుకొచ్చింది. సినిమా విడుదలకు ముందే మేకర్స్ ఇలాంటి అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతున్నారు.

Also Read:దుస్తులపై ట్రోలింగ్.. ఐశ్వర్య లక్ష్మి ఘాటు స్పందన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు