Homeతెలంగాణపొంగులేటితో డ్యామేజ్...! తీవ్ర ఆవేదనలో సీఎం రేవంత్..

పొంగులేటితో డ్యామేజ్…! తీవ్ర ఆవేదనలో సీఎం రేవంత్..

  • తాజాగా రాఘవ కనస్ట్రక్షన్ కు నోటీసులు

  • 22 ఏ వివాదంతో ఆగ్రహంగా పట్టణ మధ్య తరగతి ప్రజలు

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కానీ ఆయన చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. రేవంత్ సర్కార్ కు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తారని పేరు ఉంది. కానీ శాఖా పరమైన నిర్ణయాల్లో దొర్లిన తప్పిదాలు, వ్యక్తిగత కుటుంబ వ్యాపార ఆరోపణల కారణంగా నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. పాలనాపరంగా ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల సవాళ్లు ఎదుర్కొంటుంది. ఇప్పుడు స్వయంగా కీలక మంత్రికి సంబంధించిన వ్యాపార వివాదాలు కూడా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తున్నాయి. తాజాగా ఆయన కుటుంబానికి చెందిన రాఘవ కనస్ట్రక్షన్ కు నోటీసులు జారీ తో మరోసారి వివాదంగా మారింది పొంగులేటి పరిస్థితి.

22 ఏ భూముల వివాదం…

Also Read:పీర్జాపూర్‌లో వినాయకుడి నిమజ్జనం.. పూజలు కూడా చేయకుండానే గణనాథుడికి వీడ్కోలు

ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆ శాఖ పరంగా తీసుకున్న 22 ఏ వివాదం ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుంది. హైదరాబాద్ పరిసర జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డిలో పది లక్షలకు పైగా ప్రైవేటు ఆస్తులు, అపార్ట్మెంట్లు అధికారులు రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. సాధారణంగా రెవిన్యూ శాఖలోని సమస్యలను పరిష్కరించి పౌరులకు ఉపశమనం అందించాలి. కానీ 22 ఏ ల్యాండ్ లాకింగ్ సమస్య దశాబ్దాల తరబడి ఉన్న ఇళ్లను కూడా వివాదాల్లోకి నెట్టింది. తీవ్ర నేరస్తునాల అనంతరం మంత్రి పొంగులేటి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆ తప్పును అధికారులపై తోసేశారు. నాటకీయమైన ఈ పరిణామాలు రేవంత్ ప్రభుత్వం పై పట్టణ, మధ్యతరగతి ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసాయి.

కుటుంబ వ్యాపారాలు…

Also Read: పెద్దపల్లి జిల్లాలో విషాదం.. ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు ఆత్మహత్య

కేవలం పాలనాపరమైన వైఫల్యాలు మాత్రమే కాదు.. పొంగులేటి కుటుంబానికి చెందిన వ్యాపారాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ప్రధానంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు, మౌలిక వసతుల కాంట్రాక్టుల కేటాయింపు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాఘవ కనస్ట్రక్షన్స్ కు దక్కుతున్న అధిక ప్రాధాన్యం వంటివి.. ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రంగా మారాయి. ప్రభుత్వంలో తనకు అండగా నిలుస్తారని భావించిన పొంగులేటి.. ఇప్పుడు ఇలా పార్టీతో పాటు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తుండడంతో సీఎం రేవంత్ కూడా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే తెలంగాణలో రాజకీయ వివాదానికి మంత్రి పొంగులేటి కారణం కావడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు