Homeతెలంగాణఅమెరికన్ డైమండ్స్‌తో అలంకరించిన 48 కిలోల బంగారు గణేశుడు..

అమెరికన్ డైమండ్స్‌తో అలంకరించిన 48 కిలోల బంగారు గణేశుడు..

హైదరాబాద్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బేగంబజార్‌ ఫీల్‌ఖానా ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక గణేశుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఏకంగా 48 కిలోల బరువున్న ఈ స్వర్ణ గణపతి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. విగ్రహాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.

ఈ గణేశుడి విగ్రహాన్ని నైపుణ్యం కలిగిన కళాకారులు ఎంతో అందంగా రూపొందించారు. సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్‌తో విగ్రహాన్ని అలంకరించారు. అంతేకాకుండా 24 క్యారెట్ల బంగారు పూతను పూయడంతో గణనాథుడి రూపం మరింత దేదీప్యమానంగా కనిపిస్తోంది. విగ్రహం మెరుపులు, అలంకరణ భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ స్వర్ణ గణపతి రూపకల్పనలో ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్‌చా రాజా, తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి రూపాలను స్ఫూర్తిగా తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రెండు దివ్య రూపాల ప్రత్యేకతలను మేళవిస్తూ గణేశుడి విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.

దీంతో బేగంబజార్‌లోని ఈ గోల్డ్ గణేశుడు నగరంలోని ప్రత్యేక గణపతి విగ్రహాల్లో ఒకటిగా నిలుస్తున్నాడు. స్వర్ణ కాంతులతో మెరిసిపోతున్న గణనాథుడిని చూసేందుకు భక్తులు ఆసక్తిగా తరలివస్తున్నారు.

also read: దిశా సాలియన్ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ప్రముఖుల పేర్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు