Homeవైరల్కొబ్బరి చిప్పలో గణనాథుడు.. ఉపాధ్యాయుడి సృజనాత్మకతకు ఫిదా

కొబ్బరి చిప్పలో గణనాథుడు.. ఉపాధ్యాయుడి సృజనాత్మకతకు ఫిదా

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం హసన్‌బాద జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో వినూత్న కళాకృతి ఆకట్టుకుంది. సోమవారం పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్ ఉపాధ్యాయుడు శ్రీను తన కళా నైపుణ్యాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు.

కొబ్బరికాయను నిలువుగా కట్ చేసి, సాధారణంగా దేవుడికి నైవేద్యం సమర్పించే చిప్ప భాగాన్నే ఉపయోగించి గణనాథుడి రూపాన్ని రూపొందించారు. అందుబాటులో ఉన్న వస్తువుతో ఎంతో అందంగా వినాయకుడి ప్రతిరూపాన్ని తీర్చిదిద్దడం విద్యార్థులు, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.

ఉపాధ్యాయుడు శ్రీను చూపించిన ఈ సృజనాత్మకతను పాఠశాల విద్యార్థులు, స్థానికులు అభినందించారు. సాధారణ వస్తువులను కూడా కళాత్మకంగా మలచవచ్చని ఆయన తన ప్రతిభతో చూపించారని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

also read: ఈషా రెబ్బతో తరుణ్ భాస్కర్.. మరోసారి హాట్ టాపిక్‌గా మారిన రిలేషన్ రూమర్స్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు