దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బ మరోసారి వార్తల్లో నిలిచారు. వినాయక చవితి సందర్భంగా వీరిద్దరూ కలిసి వేడుకలు జరుపుకున్న ఫొటోను తరుణ్ భాస్కర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఈ జంటపై మరోసారి చర్చ మొదలైంది. ఫొటో చూసిన కొందరు నెటిజన్లు వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ఏదో ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓం శాంతి శాంతిశాంతి’ సినిమా షూటింగ్ సమయంలోనే ఈషా రెబ్బతో ఆయనకు సాన్నిహిత్యం పెరిగిందనే ప్రచారం కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక గతంలోనూ ఈషా రెబ్బ తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే కాదని తరుణ్ భాస్కర్ వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. దీంతో తాజాగా వినాయక చవితి వేడుకలకు సంబంధించిన ఫొటో బయటకు రావడంతో రిలేషన్‌షిప్ రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి. అయితే వీరిద్దరి బంధంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
also read: సమంత సీమంతం వేడుక.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు
