తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక సమంత సీమంతంకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు రాజ్‌ను వివాహం చేసుకున్న సమంత.. ఇటీవల తాను తల్లికాబోతున్న విషయాన్ని అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. .
ఈ నేపథ్యంలో సమంతకు సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో సీమంతం వేడుక నిర్వహించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, ఆప్తుల మధ్య ఈ వేడుకను ప్రత్యేకంగా జరుపుకున్నట్లు సమాచారం.
సీమంతం వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫొటోలు చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు సమంతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తల్లికాబోతున్న సమంతకు భవిష్యత్తు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
also read: తెలంగాణలో వాతావరణశాఖ హెచ్చరిక…! పలు జిల్లాల్లో భారీ వర్షాలు
