హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసులు ‘శంకర్’ అనే వ్యక్తిపై మరోసారి రౌడీషీట్ తెరిచారు. గతంలో అతడిపై నమోదైన రౌడీషీట్ 2019లో ముగిసింది. అయితే తాజాగా జూబ్లీహిల్స్, మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధుల్లో బెదిరింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు రావడంతో శంకర్‌పై కేసులు నమోదయ్యాయి.
ఈ కొత్త కేసులను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు అతడిపై మళ్లీ రౌడీషీట్‌ను పునరుద్ధరించారు. నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై పోలీసులు రౌడీషీట్ నమోదు చేస్తుంటారు. ఈ క్రమంలోనే శంకర్‌పై తాజా కేసుల ఆధారంగా అంబర్‌పేట పోలీసులు చర్యలు చేపట్టారు.
also read: భార్యను చంపి ఫ్రిడ్జ్ లో తలను దాచిన హత్య కేసు: పోలీసు కస్టడీలోని నిందితుడి మృతి
