Homeతెలంగాణ'సత్యం' వధ.. ధర్మం చెద...!

‘సత్యం’ వధ.. ధర్మం చెద…!

  • చిన్న తప్పిదంతో సత్యం రామలింగం రాజు పతనం

  • ప్రపంచాన్ని ఏలిన దిగ్గజ పారిశ్రామికవేత్త.. కుప్ప కూలిపోయిన వైనం

  • ఆయన జీవితం ఒక గుణపాఠం

  • ప్రస్తుతం ఎక్కడ ఉన్నారంటే?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఒక తప్పు ఎన్నో తప్పులకు కారణమైంది. అదే తప్పులు ఒక సామ్రాజ్యం కూలిపోవడానికి కారణమయ్యాయి. దీనికి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది సత్యం రామలింగం రాజు జీవితం. బైర్రాజు రామలింగం రాజు.. అలియా సత్యం రామలింగం రాజు అంటే ఒక సంచలనం. 1987 నాటి కాలంలో హైదరాబాదులో ఒక చిన్నపాటి భవనంలో కేవలం 20 మంది ఉద్యోగులతో కంపెనీని ప్రారంభించారు. 2008 నాటికి యాట 12 వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదించే స్థాయికి ఎదిగింది ఆ సంస్థ. 20 మంది ఉద్యోగులతో ప్రారంభమైన దాని ప్రస్థానం 52 వేల మందికి చేరుకుంది. దీంతో దేశంలోనే అగ్ర కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. ఏకంగా ఐదో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో ఫార్చున్ 500 కంపెనీలలో 187 స్థానాన్ని చేజిక్కించుకుంది. అటువంటి సంస్థ 2009 తర్వాత పతనవస్థకు చేరుకుంది.

విశాల సామ్రాజ్యం…

ఒక సామ్రాజ్యాన్ని విస్తరించారు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగం రాజు. కానీ కేవలం చిన్న తప్పిదంతో అంతా కుప్ప కూలిపోయింది. 2009కి ముందు సత్యం రామలింగం రాజు కీలక ప్రకటన చేశారు. ప్రపంచ స్థూల ఆర్థిక వ్యవస్థ పడిపోతున్న తరుణంలో.. సత్యం కంపెనీ మాత్రం భారీ లాభాల్లో ఉంది అంటూ ప్రకటన చేశారు. దీంతో పెట్టుబడి పెట్టే మధుపరులు భారీగా ముందుకు వచ్చారు. సత్యం కంపెనీలో షేర్ హోల్డర్లు గా మారారు. అయితే అదే సమయంలో మేటాస్ ఇన్ఫ్రాలో వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. కంపెనీకి ఆ స్థాయిలో ఆదాయం ఉన్నప్పుడు ఏకంగా మేటాస్ ప్రాపర్టీస్ ను కొనుగోలు చేయవచ్చు కదా అనే ప్రశ్నలు తలెత్తాయి. 2008లో దానిని కొనుగోలు చేసే ప్రయత్నంలో సత్యం రామలింగం రాజు విఫలమయ్యారు. దీంతో షేర్ హోల్డర్లలో ఒక రకమైన ఆందోళన మొదలైంది. సత్యం కంపెనీ షేర్ ధర పడిపోయింది. దీంతో సత్యం రామలింగం రాజు 2009లో ఒక ప్రకటన చేశారు. ఆ కంపెనీ బ్యాలెన్స్ సీట్లలో కొన్ని సంవత్సరాలుగా తప్పుడు లెక్కలు చూపించినట్లు ఒప్పుకున్నారు. ప్రత్యేక లేఖ కూడా విడుదల చేశారు. 2003 నుంచి 27 మధ్యలో సత్యం బ్యాలెన్స్ సీట్లోని మొత్తం ఆస్తుల వాస్తవ విలువ కంటే మూడు రెట్లు పెరిగి.. దాదాపు 12 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇందులో 7వేల కోట్ల రూపాయల అకౌంటింగ్ మోసాన్ని ఆయన అంగీకరించారు. ఒక చిన్న అబద్ధం.. దానిని కప్పిపుచ్చుకునేందుకు తిరిగి తప్పు చేయడం.. ఇలా చేస్తూనే పోయానని ఆయన తన లేఖలో తెలిపారు. బ్యాలెన్స్ షీట్లో తెలిపిన లాభాలు, వాస్తవ లాభాల్లో చాలా తేడాలు ఉన్నాయి. 2003 నుంచి 2007 మధ్యకాలంలో ప్రతి త్రైమాసికంలో అధికంగానే చూపించామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ అది పెరుగుతూ పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మధ్యలోనే కంపెనీలు తీవ్ర అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. 2008 ద్రవ్యోల్బణ ప్రభావంతో కంపెనీ కుప్పకూలిపోయింది. కేవలం పులిపై స్వారీ చేయడమే సత్యం రామలింగం రాజు పతనానికి కారణం.

చిన్న వయసులోనే వివాహం…

బైర్రాజు రామలింగం రాజు అలియాస్ సత్యం రామలింగం రాజు 1954 సెప్టెంబర్ 16న ఏపీలోని భీమవరంలో జన్మించారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో బీకాం చేశారు. తరువాత అమెరికాలో ఒహాయో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 1977లో ఇండియాకు తిరిగి వచ్చిన ఆయన 22 సంవత్సరాలకే వివాహం చేసుకున్నారు. రామలింగం రాజు పలు వ్యాపారాల్లో ప్రవేశించారు. 9 కోట్ల రూపాయల మూలధనంతో ధనంజయ హోటల్స్, ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక సంఘం సహకారంతో శ్రీ సత్యం స్పిన్నింగ్ మిల్స్ వంటివి ఏర్పాటు చేశారు. ఆ వ్యాపారాలు సక్సెస్ కాకపోవడంతో రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపారు. అప్పుడే మేటాస్ ఇన్ఫ్రా అనే సంస్థను ప్రారంభించారు. 1987లో సికింద్రాబాద్లోని పి అండ్ టీ కాలనీలో 20 మంది ఉద్యోగులతో సత్యం కంప్యూటర్స్ సంస్థ ప్రారంభం అయింది. 1991లో సత్యం కంప్యూటర్స్ జాన్ డీర్ అనే ఫార్చున్ 500 సంస్థ నుంచి ప్రాజెక్టు దక్కించుకుంది. 1992లో ఏకంగా స్టాక్ మార్కెట్లో నమోదయింది. 1998లో రామలింగం రాజు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యం కంప్యూటర్ సంస్థను 50వేల ఉద్యోగులతో 50 దేశాలకు విస్తరించినట్లు చెప్పారు. 1999లో రాజు అప్పుడే ప్రజాదరణ పొందుతున్న ఇంటర్నెట్ ను ఆధారం చేసుకుని సత్యం కంప్యూటర్స్ కు అనుబంధంగా సత్యం ఇన్ఫో వే అనే సంస్థను ప్రారంభించారు. ఇదే సంస్థను తర్వాత వేగేశ్న సంస్థకు విక్రయించారు.

సాధారణ జీవితం…

తన వ్యాపార సామ్రాజ్యం తో ఒక వెలుగు వెలిగిన సత్యం రామలింగం రాజు జైలు జీవితం అనుభవించారు. కేసులు ఎదుర్కొనేసరికి గుండెపోటుకు కూడా గురయ్యారు. చాలా రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. 2011లో ఆయనకు బెయిల్ మంజూర అయింది. అప్పటినుంచి ఆ కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఒక కోర్టులో తీర్పు వస్తే మరో కోర్టును ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులోనే సాధారణ జీవితం అనుభవిస్తున్నారు సత్యం రామలింగం రాజు. బహిరంగ వేదికలకు దూరంగా, చాలా నిరాడంబరంగా జీవనం సాగిస్తుండడం విశేషం. ప్రపంచంలోనే దిగ్గజ వ్యాపారవేత్తగా రాణించి.. అంతర్జాతీయంగా కూడా ఈ దేశానికి, తెలుగు రాష్ట్రానికి వన్నెతెచ్చారు సత్యం రామలింగం రాజు. కానీ చేసిన తప్పిదాలు శాపంగా మారాయి. వేలాది మంది ఉద్యోగులతో.. వేలకోట్ల ఆర్జనతో ఒక వెలుగు వెలిగిన ఆయన జీవితం ఒక ఆదర్శమే. అంతకుమించి గుణపాఠమే.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  NEET UG పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం.. 14 మంది నిందితులపై ఉత్తర్వులు రిజర్వ్ చేసిన కోర్టు!
  2. ఏఐ దుర్వినియోగంపై కృతి సనన్ న్యాయపోరాటం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ హీరోయిన్!
  3. రావణుడిపై సాయిపల్లవి వ్యాఖ్యలు.. ‘రామాయణం’ విడుదలకు ముందే సోషల్ మీడియాలో చర్చ
  4. కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు.. బీఆర్ఎస్‌లోకి రీఎంట్రీపై చర్చ!

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు