ఢిల్లీ, క్రైమ్‌మిర్రర్: అమెరికా- రష్యా ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకపోతున్నట్లు కథనాలు వెల్లెవెత్తతున్నాయి. ఉక్రెయిన్- రష్యా యుద్దాన్ని ముగించేందుకు అమెరికా అధ్యోక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తుంది. ఒకే వేళ యుద్దం ముగిస్తే రష్యాలో అమెరికా కంపెనీలు మళ్లీ కార్యాకలాపాలు ప్రారంభించడం, ఐరోపాకు చమురు సరఫరాను పునరుద్దరించడం వల్ల ప్రతిపాదనలు ఈ కీలక ఒప్పందాల్లో ఉన్నట్లు సమాచారం. యుద్దం ముగించేందుకు వ్లాదిమిర్ పుతిన్‌ను ఒప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తుంది. రష్యా తూర్పు ప్రాంతంలోని సఖాలిన్ తీరంలో ఉన్న ఉమ్మడి చమురు ప్రాజెక్టులో అమెరికా కంపెనీలు తిరిగి భాగస్వామ్యం కావడం ఒక ప్రధాన ప్రతిపాదనగా ఉన్నట్లు సమాచారం.
అలాగే రష్యా నుంచి ఐరోపాకు చమురు సరఫరాలను పునరుద్ధరించే అంశం కూడా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డ్రుజ్బా పైప్‌లైన్ ద్వారా రష్యా చమురు మళ్లీ ఐరోపా దేశాలకు చేరే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనితో పాటు సహజ వాయువు, టైటానియం ఉత్పత్తి, విమానయాన రంగాల్లోనూ అమెరికా-రష్యా మధ్య సహకారానికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అబుదాబిలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య వచ్చే నెలలో శాంతి చర్చలు జరిగే అవకాశం ఉన్నందు ఈ ఒప్పందాల్లో యుద్దానికి ముగించేందుకు పుతిన్‌ను ఒప్పించారని బావిస్తోంది. కాగా ఈ యుద్దాన్ని ముగించేందుకు పుతిన్ అంగీకరిస్తారా….అంతేగాకుండా అమెరికా ప్రతిపాదిస్తున్న వ్యాపారా శాంతి ఒప్పందానికి సుగమం చేస్తాయని అన్నది ఆసక్తి మారింది.
ఇవి కూడ చదవండి:
- రావణుడిపై సాయిపల్లవి వ్యాఖ్యలు.. ‘రామాయణం’ విడుదలకు ముందే సోషల్ మీడియాలో చర్చ
-
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు.. బీఆర్ఎస్‌లోకి రీఎంట్రీపై చర్చ!
-
ఓట్ల దొంగతానాన్ని అడ్డుకోవాలి.. నవంబర్ 1న ఢిల్లీకి రండి: రాహుల్ గాంధీ పిలుపు
-
దర్శకుడిగా రాహుల్ రామకృష్ణ.. వచ్చే ఏడాది కామెడీ ఎంటర్‌టైనర్‌తో ఎంట్రీ!
