Homeక్రైమ్పిల్లల కళ్లెదుటే భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త.. ఆపై పెద్ద కుమారుడితో పరారీ!

పిల్లల కళ్లెదుటే భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త.. ఆపై పెద్ద కుమారుడితో పరారీ!

కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలను బలిగొన్నాయి. ఉపాధి కోసం మరో నగరానికి వెళ్లే విషయమై భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. ముగ్గురు పిల్లలు చూస్తుండగానే భార్యపై గొడ్డలితో దాడి చేసి భర్త ఆమెను హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో కలకలం రేపింది.

జిల్లాలోని అల్హాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చౌరియా గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అవనీష్ (35), సుశీల (30) దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఉపాధి కోసం వేరే నగరానికి వెళ్లే అంశంపై కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అవనీష్, తన భార్య సుశీలపై గొడ్డలితో దాడి చేశాడు. మెడ, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన సమయంలో ముగ్గురు పిల్లలు అక్కడే ఉండటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

భార్యను హత్య చేసిన అనంతరం అవనీష్ తన పెద్ద కుమారుడిని వెంట తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అవనీష్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కుటుంబ వివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

also read: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యాభర్తలు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు