తెలుగు సినీ పరిశ్రమలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు బుధవారం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
చలసాని వెంకటేశ్వరరావు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొంది. సినీ రంగానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది.
నిర్మాతగా చలసాని వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రాల్లో ‘దానవీరశూరకర్ణ’ ప్రత్యేక గుర్తింపు పొందింది. 2015లో ఆయన నిర్మించిన ఈ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకుంది. ఈ పురస్కారం ఆయన నిర్మాణ ప్రతిభకు గుర్తింపుగా నిలిచింది.
చలసాని వెంకటేశ్వరరావు మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు సానుభూతి తెలియజేస్తున్నారు.
also read: ఉక్రెయిన్‌లో రైల్వే స్టేషన్‌పై డ్రోన్ దాడి.. 13 మంది మృతి!
