Homeతెలంగాణప్ర‌భుత్వ బ్యాంకులు అమ్మ‌కానికి పెట్టే ఆస్తులు కావు...! ప్ర‌తిప‌క్ష నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ...

ప్ర‌భుత్వ బ్యాంకులు అమ్మ‌కానికి పెట్టే ఆస్తులు కావు…! ప్ర‌తిప‌క్ష నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ…

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: దేశ నిర్మాణానికి ఉప‌యోగ‌ప‌డే సంస్థ‌లు, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు అమ్మ‌కానికి పెట్టే ఆస్తులు కావ‌ని ప్ర‌తిప‌క్ష నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీక‌ర‌ణనువ్య‌తిరేకిస్తూ ఐడీబీఐ ఉద్యోగుల‌కు మ‌ద్ద‌తుగా శుక్ర‌వారం రాహుల్ గాంధీ బ‌హిరంగ లేఖ రాశారు. లాభాల్లో న‌డుస్తున్న ప్ర‌భుత్వ బ్యాంక్‌ను ఎందుకు విక్ర‌యిస్తున్నార‌ని కేంద్రాన్ని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు.

కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ కంపెనీకి ఐడీబీఐను విక్రయించాలని కేంద్రం నిర్ణయించిందని ఆ లేఖలో ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఏడేళ్ల క్రితం నష్టాల్లో ఉన్న ఐడీబీఐ.. గత ఏడాది రూ.9 వేల కోట్లకుపైగా లాభాలు ఆర్జించిందని తెలిపారు. ఈ బ్యాంకును లాభాల బాట పట్టించింది.. అందులోని ఉద్యోగుల కష్టమేనని చెప్పారు. ఈ బ్యాంక్ ప్రైవేటీకారణను వ్యతిరేకిస్తున్న సిబ్బందికి రాహుల్ గాంధీ తన సంఘీభావాన్ని ప్రకటించారు. బ్యాంక్ ఉద్యోగుల పోరాటానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ చేతుల్లో 95 శాతం ఐడీబీఐ వాటాలు ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. విక్రయం తర్వాత ప్రభుత్వ, ఎల్‌ఐసీ వాటా 34 శాతానికి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2003లో ఐడీబీఐలో కనీసం 51 శాతం వాటా కొనసాగిస్తామని పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, ఉద్యోగ భద్రత కూడా ప్రమాదంలో పడతాయని ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యాభర్తలు మృతి
  2.  ఢిల్లీలో దారుణం.. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్తపై కత్తితో దాడి!
  3. ఏఐ దుర్వినియోగంపై కృతి సనన్ న్యాయపోరాటం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ హీరోయిన్!
  4.  రావణుడిపై సాయిపల్లవి వ్యాఖ్యలు.. ‘రామాయణం’ విడుదలకు ముందే సోషల్ మీడియాలో చర్చ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు