-
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.. ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి
క్రైమ్ మిర్రర్, బాలాపూర్ (హైదరాబాద్): బాలాపూర్‌లోని సత్యసాయి నగర్, ఆర్‌సీఐ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన *రామరాజ్ కాటన్ – కల్చర్ ఆఫ్ ఇండియా* షోరూం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి షోరూంను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతికి ప్రతీకగా నిలిచే వస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. నూతన వ్యాపార సంస్థలు స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచాలని ఆకాంక్షించారు. తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నాణ్యమైన వస్త్రాలతో వినియోగదారుల ఆదరణ పొందుతూ రామరాజ్ కాటన్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్థానికులు పాల్గొన్నారు.
ఇవి కూడ చదవండి:
-
ప్రభుత్వ బ్యాంకులు అమ్మకానికి పెట్టే ఆస్తులు కావు…! ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ…
-
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్.బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు…! చికిత్స పొందుతూ అమెరికాలో మృతి…
-
కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చడమే లక్ష్యం….! ఈటెల సంచలన వ్యాఖ్యలు…
-
దారుణం…తల్లి చేతిలో కుమార్తె హత్యా…! ఆ ప్రాంతంలో కలకలం…
