HomeUncategorizedప‌ల్నాడ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం...! స్పాట్‌లోనే ఇద్ద‌రు...

ప‌ల్నాడ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం…! స్పాట్‌లోనే ఇద్ద‌రు…

ప‌ల్నాడ్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ప‌ల్నాడ్ జిల్లాలోని రొంపిచ‌ర్ల వ‌ద్ద‌ సోమ‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు స్పాట్‌లోనే మృతి చెంద‌డంతో ఆ ప్రాంతంలో విషాదం నెల‌కొంది. సోమ‌వారం ఉదయం రామాంజనేయులు(40), వెంకట ఆంజనేయులు బైక్‌‌లో హైవేపై వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. బైక్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది.

Also Read:ఇంట‌ర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం…! మ‌త్తుకు బానిస చేసి దారుణం…ఫోక్సో కేసు న‌మోదు…

ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఈపూరు మండలం ఇనిమెళ్ల వాసులుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే రొంపిచర్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరి మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు