Homeక్రైమ్ఇంట‌ర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం...! మ‌త్తుకు బానిస చేసి దారుణం...ఫోక్సో కేసు న‌మోదు...

ఇంట‌ర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం…! మ‌త్తుకు బానిస చేసి దారుణం…ఫోక్సో కేసు న‌మోదు…

హైదరాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: 16 ఏళ్ల ఇంట‌ర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం చేసిన ఘ‌ట‌న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటు చేసుకుంది. కొందరు నిందితులు కొన్ని నెలల నుంచి బాలికను మత్తుమందు, గంజాయికి బానిసగా మార్చి ఆమెతో బలవంతంగా తమ కోరికలు తీర్చుకుంటున్నారు. బాలికపై ఓయో గదిలో, కారులో, రైలులో పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆమెకు నరకం చూపిస్తున్నారు. ఇటీవల మరోసారి బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. మరోచోటుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా నిందితుల చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాధితురాలు కుటుంబ సభ్యులకు జరిగిన దారుణాన్ని చెప్పింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

మ‌త్తు మానిస‌గా మార్చి అత్యాచారం…

Also Read: ప్రేమలో విఫలం.. యువతి బలవన్మరణం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మచ్చబొల్లారానికి చెందిన 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిపై కొందరు ఆకతాయిలు కొంతకాలం నుంచి అత్యంత పైశాచికంగా వ్యవహరించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న సమయంలో బాధితురాలికి జెర్రీ వరుణ్ అనే యువకుడితో పరిచయమైంది. కొన్ని నెలల కిందట అతడు చాక్లెట్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి కారులోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రొమాల వరుణ్ అనే మరొక యువకుడు ఆమెకు పరిచయమై మద్యం, సిగరెట్లు, గంజాయి వంటి మత్తు పదార్థాలు ఇచ్చి లోబరుచుకున్నాడు. అనంతరం కొంపల్లికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన డేవిడ్ అనే వ్యక్తి కూడా బాలికకు మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

రైల్వే స్టేషన్‌లో పరిచయం.. ఓయో గదిలో అత్యాచారం…

Also Read:ప్రియుడితో అక్రమ బంధం.. భర్తను అంతమొందించిన భార్య

కుమార్తె ప్రవర్తనలో తేడా గమనించిన తండ్రి ఈ నెల 9న ఆమెను మందలించాడు. దాంతో బాలిక ఇల్లు వదిలి బొల్లారం రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు నీరజ్ అనే వ్యక్తి పరిచయమై, తన స్నేహితుడైన విక్కీని అక్కడికి పిలిపించాడు. వారిద్దరూ కలిసి బాలికకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత విక్కీ తన స్నేహితుడైన నిఖిల్‌ను పిలిపించి బాలికను దూలపల్లిలోని ఒక ఓయో గదికి తీసుకెళ్లాడు. అక్కడ నిఖిల్‌తో పాటు అతడి ఇద్దరు స్నేహితులు కలిసి ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేశారు. అదేరోజు రాత్రికి విక్కీ బాలికను తీసుకెళ్లి తన ఇంట్లోనే బంధించాడు.

తప్పించుకుని ఇంటికి చేరిన బాధితురాలు…

Also Read: కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

మరుసటి రోజు (ఈ నెల 10న) నిందితుడి నుంచి బాలిక తప్పించుకుని తిరిగి బొల్లారం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఇది గమనించిన విక్కీ తన మరో స్నేహితుడు గణేశ్‌తో కలిసి ఆమెను అడ్డుకున్నాడు. వారిద్దరూ బాలికను బలవంతంగా మత్తులోకి దించి మేడ్చల్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ రైలులోనే మరోసారి విద్యార్థినిపై లైంగిక దాడి చేశారు. ఆ తర్వాత నిందితులు ఆమెను మల్కాజిగిరి మీదుగా ధూల్‌పేటకు తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా, బాలిక వారి నుంచి చాకచక్యంగా తప్పించుకుని అతికష్టమ్మీద ఇంటికి చేరుకుంది. జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు వివరించడంతో వారు వెంటనే అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు