Homeతెలంగాణకోమటిరెడ్డి బ్రదర్స్ రూట్ సపరేట్...!

కోమటిరెడ్డి బ్రదర్స్ రూట్ సపరేట్…!

  • ఏపీలో జగన్ బలపడాలి

  • తెలంగాణలో తమ రాజకీయ ప్రాబల్యం పెరగాలి

  • తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ స్టైల్ వేరు. వారు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తుంటారు. కానీ కాంగ్రెస్ కోసం మాత్రం కాదు. తమ అస్తిత్వాన్ని, రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఎంతగానో పరితపిస్తుంటారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాబినెట్లో కొనసాగుతున్నారు.

అదే క్యాబినెట్ లోకి తనను తీసుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మంత్రులు పదవులు కోరుకోవడాన్ని ఇతర నేతలు సహించుకోలేకపోతున్నారు. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం దీనిని సమర్థించుకుంటున్నారు. తప్పేంటి అని ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు.

  • ప్రత్యర్థులకు అస్త్రం…

కోమటిరెడ్డి బ్రదర్స్ భిన్న వైఖరితో వ్యవహరిస్తుంటారు. ఉన్నది అధికార కాంగ్రెస్ పార్టీలో. కానీ ప్రత్యర్ధులకు లాభం చేకూర్చేలా మాట్లాడుతుంటారు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై తెలంగాణకు దారుణంగా మోసం చేశారని వచ్చారు.

తెలంగాణకు రావాల్సిన జలాలను.. జగన్మోహన్ రెడ్డి తనుకు పోయారు అంటూ ఆయనకు క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కృష్ణా జలాలను రాయలసీమకు జగన్ తీసుకెళ్లారు అంటూ తాజాగా వ్యాఖ్యానించారు. తద్వారా జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ మైలేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇటీవల వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో రాయలసీమ జిల్లాల్లో కూటమి పట్ల సానుకూలత ఉంది. ఈ పరిస్థితుల్లో కెసిఆర్ నిర్లక్ష్య వైఖరి కారణంగా జగన్ కృష్ణా జలాలను తరలించకు పోయారు అనేది మంత్రి కోమటిరెడ్డి వాదన.

  • రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పనవసరం లేదు. మంత్రి పదవి రాకపోయిన ప్రతిసారి వైయస్ రాజశేఖర్ రెడ్డి ని గుర్తు చేస్తుంటారు. తామంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసులమని చెబుతుంటారు. వీరంతా పాత కాంగ్రెస్ నాయకులు. తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి విషయంలో వీరికి భిన్నాభిప్రాయం ఉంది. రేవంత్ చంద్రబాబు మనిషి అనేది వీరి వాదన.

కానీ కెసిఆర్ తో స్నేహం చేసే జగన్మోహన్ రెడ్డి మాత్రం తమ వాడిగా భావిస్తారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఆయన కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. మొన్న మంత్రి పదవి రాలేదన్న ఆవేదనతో ఓ 20 మంది ఎమ్మెల్యేలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోగు చేశారు అనేది ఒక విమర్శ. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. వీరు జగన్మోహన్ రెడ్డి శ్రేయోభిలాషులు అనేది ఇట్టే అర్థం అయిపోతుంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు