క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్లో మంగళవారం ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు రాజీవ్ గృహకల్ప సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హయత్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజీవ్ గృహకల్ప నుంచి ప్రయాణికులతో బయలుదేరి మెయిన్ రోడ్డును దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో నాగోల్ వైపు నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ బస్సును బలంగా ఢీకొట్టింది.
ఢీకొన్న తీవ్రతకు బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి 108 అంబులెన్స్లకు సమాచారం అందించారు. క్షతగాత్రులను వనస్థలిపురం, సికింద్రాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ ప్రారంభించారు. టిప్పర్ లారీ అతివేగమే ప్రమాదానికి కారణమైందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
also read : కాదంబరీ జెత్వానీ కేసు: ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత
