Homeఆంధ్ర ప్రదేశ్పెంపుడు కుక్క అరుపులతో ఆళ్ల నాని మృతి వెలుగులోకి.. వాచ్‌మన్ కన్నీటి పర్యంతం

పెంపుడు కుక్క అరుపులతో ఆళ్ల నాని మృతి వెలుగులోకి.. వాచ్‌మన్ కన్నీటి పర్యంతం

క్రైమ్ మిర్రర్ : ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మంగళవారం మృతి చెందారు. ఆయన మరణించిన విషయాన్ని తొలుత తన పెంపుడు కుక్క ‘మ్యాక్సీ’ అరుపుల ద్వారానే గుర్తించినట్లు ఇంటి వాచ్‌మన్ అప్పారావు తెలిపారు. ప్రతిరోజూ వాకింగ్‌ ముగించుకుని వచ్చిన తర్వాత ఆళ్ల నాని కొద్దిసేపు తనతో మాట్లాడేవారని అప్పారావు చెప్పారు. మంగళవారం కూడా వాకింగ్‌ అనంతరం తనతో మాట్లాడిన ఆళ్ల నాని ఇంట్లోకి వెళ్లారని తెలిపారు. కొద్దిసేపటికే ఇంటి లోపలి నుంచి మ్యాక్సీ గట్టిగా అరవడం వినిపించడంతో అనుమానం వచ్చి వెంటనే లోపలికి వెళ్లినట్లు వివరించారు.

ఇంతకుముందెప్పుడూ మ్యాక్సీ అలా పెద్దగా అరవలేదని అప్పారావు పేర్కొన్నారు. కుక్క అరుపులు వినిపించిన సమయంలోనే ఆళ్ల నాని అస్వస్థతకు గురై ఉండొచ్చని భావించి వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే అప్పటికే ఆయన మృతి చెంది సుమారు 15 నిమిషాలు అయి ఉంటుందని వైద్యులు తెలిపినట్లు వెల్లడించారు. అయ్యగారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ వాచ్‌మన్ అప్పారావు భావోద్వేగానికి గురయ్యారు.

బుధవారం ఏలూరుకు మృతదేహం

ఆళ్ల నాని మృతదేహం మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఏలూరుకు చేరుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉంగుటూరు మండలం బాదంపూడిలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న ఆయన ఇద్దరు కుమారులు బుధవారం సాయంత్రం ఏలూరుకు చేరుకోనున్నారు. వారి రాక అనంతరం కుటుంబ సభ్యులు సమావేశమై అంత్యక్రియల తేదీ, సమయంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
also read : వరంగల్ కార్పొరేషన్ పై గురి…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు