తిరుపతి, క్రైమ్‌మిర్రర్: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత ఎన్. అమరనాథ రెడ్డి ఎక్కడున్నారు. ఆయన టీడీపీలోనే ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది? పార్టీలో ఒక్కసారిగా సైలెంట్ అయిన అమరనాథ రెడ్డి తీవ్ర స్థాయిలో అసంతృప్తికి లోనవుతున్నారా? అన్న అనుమానం కలుగుతుంది. దాదాపు రెండేళ్ల నుంచి అమరనాథ రెడ్డి పార్టీ లో యాక్టివ్ గా లేరు. గతంలో రాజకీయంగా కీలకంగా వ్యవహరించే అమరనాథ రెడ్డి ఈ టర్మ్ లో మాత్రం మౌనం పాటించడం వెనక కేవలం అసంతృప్తి కారణమని పార్టీ నేతలే చెబుతున్నారు. తనకు 2024 ఎన్నికల తర్వాత ప్రాధాన్యత దక్కడం లేదన్న అభిప్రాయంలో అమరనాథ రెడ్డి ఉన్నారు. అందుకే అమరావతికి కూడా దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటున్నారు.చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం నుంచి అమరనాథ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Also Read:Insurance Murder Case: రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం.. ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య!
ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఉన్న ఈ నేత అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేయాల్సిన సమయం. అయితే తనకు తొలి విడత మంత్రి పదవి దక్కుతుందని భావించినప్పటికీ ఆయనకు రాలేదు. చిత్తూరు జిల్లా నుంచి కేవలం ముఖ్యమంత్రి గా చంద్రబాబు మాత్రమే ఉన్నారు. మరెవరికీ అవకాశం కల్పించలేదు. చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మినహా మరే సందర్బంలో వీరు పెద్దగా కనిపించడం లేదు. అలాగే విపక్షాలు చేసే విమర్శలకు సయితం స్పందించడం లేదు.1996లో పుంగనూరు నియోజకవర్గంకి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
Also Read:Sanchitha Ugale: షాకింగ్.. నటి సంచితా ఉగాలే ఆత్మహత్య.. బాలీవుడ్ లో తీవ్ర విషాదం!
1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలై, 2004లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.
చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.తర్వాత జూన్ 2016లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడి టీడీపీలో చేరాడు. 2017లో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా అమరనాధ్ రెడ్డికి మంత్రి పదవి లభించింది. 2024లో ఎన్నికల్లో తిరిగి టీడీపీ నుంచి విజయం సాధించారు. ట్రాక్ రికార్డును చూసిన తర్వాత మంత్రి పదవి దక్కాల్సి ఉన్నా రాకపోవడంతో ఆయన తన పెదవి విప్పడం లేదని అంటున్నారు.
Also Read:Vijay-Sangeetha Divorce Case: సీఎం విజయ్ విడాకుల కేసు, కోర్టు కీలక నిర్ణయం!