క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఎయిర్‌పోర్టు విషయంలో కూటమి నేతలు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.ఎయిర్‌పోర్టు ప్రారంభాన్ని తాము స్వాగతిస్తున్నామని సజ్జల స్పష్టం చేశారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ‘ఎర్రబస్సు రాని చోటుకు ఎయిర్ బస్సు ఎందుకని’ జగన్ అన్నట్లుగా కూటమి నేతలు అసత్యాలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎన్నడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అనని మాటలను అన్నట్లుగా ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు.
ప్రధాని మోదీపై వ్యాఖ్యలకు కన్నీళ్లొచ్చాయన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో తమ ప్రభుత్వానిదే కీలక పాత్ర అని సజ్జల ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ హయాంలోనే ఎయిర్‌పోర్టు పనులు 75-80 శాతం వరకు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. కేవలం మిగిలిన 20-25 శాతం పనులు పూర్తి చేయడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) ప్రభుత్వానికి రెండేళ్లు పట్టిందని విమర్శించారు. “దాదాపుగా పూర్తయిన ప్రాజెక్టును ముగించినందుకు క్రెడిట్ ఎవరికి దక్కాలి? 80 శాతం పనులు చేసిన వారికా, లేక మిగిలిన కొద్దిపాటి పనులు చేసిన వారికా?” అని సజ్జల ప్రశ్నించారు.అంతేకాకుండా, ఎయిర్‌పోర్టుకు సరైన రోడ్డు సౌకర్యాలు కూడా లేవని ఆయన ఆరోపించారు. ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉండాల్సిన కనీస మౌలిక సదుపాయాలను, ముఖ్యంగా రోడ్డు యాక్సెస్‌ను కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఒక పక్క క్రెడిట్ కోసం ఆరాటపడుతూ, మరో పక్క కనీస సదుపాయాలు కల్పించకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు.
ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. 59కి చేరిన బాధితుల సంఖ్య
