-
సీనియర్ ఐఏఎస్ అధికారి వైపు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు
-
రేసులో మరికొందరు ఐఏఎస్ అధికారులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో కొత్త వారి ఎంపిక అనివార్యంగా మారింది.
వాస్తవానికి ఆయన ఈ ఏడాది మార్చిలోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. తెలంగాణ సర్కార్ ప్రత్యేక అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు మూడు నెలల పాటు సేవాకాలాన్ని పొడిగించింది.
Also Read: సింగూరు డ్యామ్ డేంజర్‌లో ఉందా….? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందీ… – Crime Mirror
ఈ పొడిగింపు గొడుగు కూడా పూర్తి కావస్తుండడంతో.. తదుపరి సీఎస్ గా బాధ్యతలు చేపట్టేది ఎవరు అనేదానిపై సచివాలయంలో జోరుగా చర్చ సాగుతోంది. ప్రముఖంగా జయేష్ రంజన్ పేరు వినిపిస్తోంది.
-
ముందు వరుసలో..
జయేష్ రంజన్ ప్రస్తుతం రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సి ఎస్ గా అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. 1992 బ్యాచ్ కు చెందిన రంజన్ పేరు సిఎస్ పదవికి బలంగా వినిపించడానికి ప్రత్యేక కారణం ఆయనకున్న అనుభవం.
పైగా క్రమశిక్షణ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఏపీతోపాటు తెలంగాణలోనూ ఐటీ పరిశ్రమల శాఖల కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయనకు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలతో మంచి సంబంధాలు ఉన్నాయి.
Also Read: ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసు…! – Crime Mirror
రాష్ట్రంలో ఐటీ ఎగుమతుల పెంపు, స్టార్టప్ ఎకో సిస్టం బలోపేతం, గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో ఆయన వ్యూహాత్మక పాత్ర పోషించారు. పాలనాపరమైన సంస్కరణలను వేగవంతంగా అమలు చేయగలరు అని పేరు పొందారు. సీనియారిటీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం.
-
ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల దృష్ట్యా..
మరోవైపు చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నారు. ప్రధానంగా 1991, 1992 బ్యాచ్ లకు చెందిన సీనియర్ల పేర్లు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం వివిధ కీలక శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారులు తమ ప్రయత్నాల్లో ఉన్నారు.
Also Read: కుప్పకూలిన మమత బెనర్జీ సామ్రాజ్యం…! – Crime Mirror
గతంలో పనిచేసిన అనుభవం, సామాజిక సమీకరణలు, కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకుంటే.. చివరి వరకు ఉత్కంఠ తప్పదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం శాఖల మధ్య సమన్వయం చేసుకునే సమర్థ అధికారికి చాన్స్ ఇవ్వాలని చూస్తోంది.
ప్రతిష్టాత్మకమైన మూడో దశ మెట్రో విస్తరణ, హైదరాబాద్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి వంటి కీలక అజెండాలతో ముందుకు సాగుతున్న తరుణంలో.. సమర్థవంతమైన అధికారికి బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉంది.. జయేష్ రంజన్ పేరు ఖరారు చేసే అవకాశాలే ఎక్కువ.
Also Read: సింగరేణిలో బొగ్గు మాయం.. ముఖ్యమంత్రికి కిషన్ రెడ్డి లేఖ!! – Crime Mirror