Homeసినిమాబ్రేకప్ రూమర్లపై అనుపమ పరమేశ్వరన్ క్లారిటీ! ఎమోషనల్ కామెంట్స్ వైరల్

బ్రేకప్ రూమర్లపై అనుపమ పరమేశ్వరన్ క్లారిటీ! ఎమోషనల్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు ఎట్టకేలకు స్పందించారు. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా తమిళ్ యువ హీరోతో ఆమె లవ్ స్టోరీ, బ్రేకప్ వంటి వార్తలు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అనుపమ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, గత ఏడాది తనకు చాలా కఠినమైన దశగా గడిచిందని వెల్లడించింది. ఆ సమయంలో అనేక మానసిక ఒత్తిడులు, భావోద్వేగ సంఘర్షణలను ఎదుర్కొన్నానని చెప్పింది. ఆ కష్టాలను అధిగమించి మళ్లీ సాధారణ జీవితంలోకి రావడం సులభం కాలేదని తెలిపింది.

“గత సంవత్సరం నా జీవితంలో చాలా క్లిష్టమైన సమయం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, వాటిని దాటుకుని ఇప్పుడు నేను మళ్లీ సంతోషం వైపు ప్రయాణం ప్రారంభించాను” అని ఆమె పేర్కొన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యమని, మన భావోద్వేగాలకు విలువ ఇవ్వాలని ఆమె సూచించింది.

తనకు ఈ కష్టకాలంలో అండగా నిలిచిన అభిమానులు, స్నేహితులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. వారి మద్దతు లేకపోతే ఈ పరిస్థితులను ఎదుర్కోవడం కష్టమయ్యేదని వెల్లడించింది.

ఇటీవల వచ్చిన లవ్, బ్రేకప్ వార్తలపై ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, ఆమె వ్యాఖ్యలు ఆ పుకార్లకు పరోక్షంగా సమాధానం ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్లకు ఒక విధంగా ముగింపు పలికినట్టయింది.

ఇప్పుడు అనుపమ తన కెరీర్‌పై దృష్టి సారిస్తూ, కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆమె అభిమానులు కూడా ఆమె తిరిగి సంతోషంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు.

also read: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ సూచనల పత్రం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు