Homeతెలంగాణసింగూరు డ్యామ్ డేంజ‌ర్‌లో ఉందా....? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందీ...

సింగూరు డ్యామ్ డేంజ‌ర్‌లో ఉందా….? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందీ…

మెదక్, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యవసా య రంగానికి వెన్నెముకగా, హైదరాబాద్ జంట నగరాల దాహార్తిని తీర్చే ప్రధాన వనరుగా ఉన్న సింగూరు మల్టీపర్పస్ ప్రాజెక్టు (మంజీరా నది) ప్రస్తుతం అత్యంత కీలకమై న దశను ఎదుర్కొంటోంది. ప్రాజెక్టు భద్రతపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రస్తుతం రిజర్వాయర్‌లో యుద్ధప్రాతిపదికన మరమ్మ తులు సాగుతున్నాయి.అయితే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పను ల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, పనుల మందగమనంపై క్షేత్రస్థాయిలో తీవ్ర అసం తృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల ఎన్‌డీఎస్‌ఏ ఉన్నతాధికారుల తనిఖీల్లో కూడా స్పష్టమైంది. మార్చిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి చెందిన ఉన్నత స్థాయి నిపుణుల బృందం సింగూరు ప్రాజెక్టును నేరుగా సందర్శించి, సాగుతున్న పనులను పరిశీలించింది. ఆ సమయంలో కాంట్రాక్టర్ వ్యవహరించిన తీరుపై వారు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంటే, కాంట్రాక్టర్ క్షేత్రస్థాయిలో కేవలం ఒక్క జేసీబీ, ఒక ట్రక్కును మాత్రమే ఉపయోగించి పనులు చేయడంపై అధికారులు తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలిసింది.

Also Read:మెట్రో ఫేజ్-2కు కేంద్రం బ్రేకులు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

రిజర్వాయర్ ఎర్త్ డ్యాం లోపలి భాగంలో ఎక్కడైతే రివిట్‌మెంట్ తీవ్రంగా దెబ్బతిని బుంగలు పడ్డాయో, అక్కడ మొదట పనులు ప్రారంభించాల్సింది పోయి.. డ్యాంకు ఒక చివర నుంచి సాధారణ పద్ధతిలో పనులు చేపట్టడంపై నిపుణులు తప్పుపట్టారు. కాగా వానాకాలం సీజన్‌లో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో కాకుండా కేవలం 15 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, రివిట్‌మెంట్‌లో ఏర్పడిన బుంగలు, లీకేజీల కారణంగా రక్షణ చర్యల్లో భాగంగా నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం మరమ్మతు పనుల కోసం నీటి నిల్వను గతంలో 8 టీఎంసీలకు తగ్గించగా, వేసవి అవసరాల తర్వాత ప్రస్తుతం అది మరింత పరిమితమయ్యే అవకాశం ఉంది.ఈ వానాకాలంలో కర్ణాటక, మహారాష్ట్ర క్యామెంట్ ఏరియాల నుంచి భారీగా వరద నీరు వచ్చినా.. రక్షణ దృష్ట్యా 15 టీఎంసీలకు మించి నిల్వ చేయకుండా మిగిలిన నీటిని గేట్లు ఎత్తి దిగువకు వదలాలని నిర్ణయించారు.

Also Read:తులసి మొక్క ఎంచక్కా బాగుండాలంటే..?

డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎస్‌ఆర్పీ) హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. . హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ వంటి పశ్చిమ ప్రాంతాలకు సింగూరే ప్రధాన తాగునీటి వనరు. వేసవిలో నీటి నిల్వలు తగ్గినప్పటికీ, హైదరాబాద్ జలమండలి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నీటి సరఫరాను క్రమబద్ధీకరించింది. ఈ సీజన్‌లో నిల్వ చేయబోయే 15 టీఎంసీల నీరు జంట నగరాల తాగునీటి అవసరాలకు (ఏడాదికి దాదాపు 4 టీఎంసీలు అవసరం), పరిశ్రమలకు పూర్తిగా సరిపోతుంది. దీంతో హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఎలాంటి ముప్పు లేదని అధికారవర్గాలు చెపుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యపు పనులపై వివరణ కోరేందుకు ఇరిగేషన్ శాఖ డీఈని సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.వానాకాలం సీజన్ ముంచుకొస్తున్న వేళ.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు మరింత ఆలస్యమైతే సాగు, తాగునీటి సరఫరాపై ప్రభావం పడనుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధికారికంగా దాదాపు 40 వేల ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు నీరందిస్తున్నప్పకీ సుమారు 80వేల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు.

Also Read:కలియుగాన్ని స్థాపించి తనే కలి కావాలనుకునే 17 ఏళ్ల కుర్రాడు.. ఓటీటీలో ట్రెండింగ్ సిరీస్

ప్రాజెక్టు సామర్థ్యాన్ని 15 టీఎంసీలకే పరిమితం చేస్తున్నందున, వానాకాలం సాగునీటి విడుదలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. క్యామెంట్ ఏరియా నుంచి వచ్చే వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పంటలకు నీరు విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖ భావిస్తోంది. కాగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు రక్షణ విషయంలో రాజీ పడబోమని, కాంట్రాక్టర్లు ఒకే సీజన్ లోపల పనులన్నీ పూర్తిచేయాలని కఠినంగా ఆదేశించారు.పనులను వేగవంతం చేయకపోతే క్రాప్ హాలిడే (పంటల విరామం) ప్రకటించాల్సి వస్తుందని, అది రైతులకు నష్టం కలిగిస్తుందని కాంట్రాక్టర్‌ను, స్థానిక ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. నీటి అడుగున ఎక్కడైనా పగుళ్లు లేదా లీకేజీలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి సోనార్ పరీక్షలు, అండర్ వాటర్ సర్వేలు త్వరితగతిన నిర్వహించాలని మంత్రి సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు