Homeక్రైమ్అమానుషం...మ‌న‌వ‌రాలిపై తాత అత్యాచారం...!

అమానుషం…మ‌న‌వ‌రాలిపై తాత అత్యాచారం…!

ములుగు, క్రైమ్‌మిర్ర‌ర్‌: మ‌హిళ‌లు, బాలిక‌లు, ప‌సి పిల్ల‌ల వ‌ర‌కు ఎక్క‌డో ఒక్కోచోట కామాంధుల చేతులో బ‌లి అవుతూనే ఉన్నారు. ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చిన అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. ఎవ‌రిని న‌మ్మాలో… ఎవ‌రిని న‌మ్మ‌వ‌ద్దో తెలియ‌ని ప‌రిస్థితులు వ‌చ్చాయి. తాజాగా ములుగు జిల్లా వాజేడు మండలంలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. తలుపులు వేసి 14 ఏళ్ల బాలికపై తాత మోడెం కృష్ణయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Also Read:భారత్ కు జిన్ పింగ్…! సెప్టెంబ‌రులో బ్రిక్స్ స‌ద‌స్సుకు హాజ‌రు…

ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురవ్వగా, నానమ్మ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలిక గర్భం దాల్చిందని వైద్యులు చెప్పగా, బాలికను నిలదీసింది నానమ్మ. తాతయ్యే ఇలా చేశాడని మైనర్ బాలిక చెప్పడంతో.. కృష్ణయ్యను కుటుంబ సభ్యులు నిలదీసారు. అబార్షన్ చేపించి, పెళ్లి అయ్యేవరకు ఖర్చులు భరిస్తానని కృష్ణయ్య భరోసా ఇచ్చాడని బాలిక ఆరోపించింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వస్తున్నాయి.

Also Read:ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు