Homeసినిమాహీరో విజయ్‌తో హాలీవుడ్ స్టార్ జాసన్ స్టాథమ్ సినిమా.. అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్: జేసన్...

హీరో విజయ్‌తో హాలీవుడ్ స్టార్ జాసన్ స్టాథమ్ సినిమా.. అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్: జేసన్ సంజయ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’ సినిమా ద్వారా ఆయన ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు ప్రాజెక్టులు, సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఇంటర్వ్యూలో భాగంగా హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాసన్ స్టాథమ్‌తో సినిమా చేసే అవకాశం వస్తే, తమిళ సినిమా నుంచి ఏ హీరోను ఎంపిక చేస్తారని అడిగితే, జేసన్ సంజయ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన తండ్రి విజయ్ పేరును చెప్పడం ప్రత్యేకంగా నిలిచింది. విజయ్, జాసన్ స్టాథమ్ కలయికలో సినిమా చేయడం తన కల అని, ఆ ప్రాజెక్ట్ అద్భుతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

తాను ఇచ్చిన ఈ సమాధానంపై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ రావడం ఖాయం అని ముందే తెలుసని సరదాగా వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తన అభిప్రాయం మార్చుకోనని స్పష్టం చేశారు.

ఇక నటనపై ఆసక్తి లేకపోవడంతోనే దర్శకత్వం వైపు వచ్చానని జేసన్ సంజయ్ చెప్పారు. చిన్నప్పటి నుంచి సినిమా సెట్స్‌లో గడిపిన అనుభవం తనలో ఫిల్మ్‌మేకింగ్‌పై ఆసక్తిని పెంచిందని తెలిపారు. ఈ రంగంలో మరింత అవగాహన కోసం కెనడాలో శిక్షణ కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇప్పుడిక ‘సిగ్మా’ సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్న జేసన్ సంజయ్, భవిష్యత్తులో మరిన్ని పెద్ద ప్రాజెక్టులతో తన సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

also read: నిషేధిత గడ్డిమందుల అక్రమ రవాణా బట్టబయలు.. నలుగురు అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు