భద్రాద్రి కొత్తగూడెం రామవరంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆందోళనకర సంఘటన చోటుచేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేశాడనే ఆరోపణలు వెలుగుచూశాయి.
వివరాల ప్రకారం, భుక్య తమన్ తేజ్ అనే విద్యార్థిని తెలుగు ఉపాధ్యాయుడు రాజేందర్ రెడ్డి తీవ్రంగా కొట్టినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండానే తమ కుమారుడిపై దాడి జరిగిందని, ఈ ఘటనలో బాలుడికి గాయాలయ్యాయని వారు తెలిపారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, పాఠశాల యాజమాన్యం కూడా ఈ విషయంపై విచారణ చేపట్టి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
also read: హీరో విజయ్‌తో హాలీవుడ్ స్టార్ జాసన్ స్టాథమ్ సినిమా.. అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్: జేసన్ సంజయ్
