మునుగోడు, క్రైమ్ మిర్రర్ : మునుగోడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు కరువవ్వడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ వృద్ధుడు పడుకోవడానికి మంచం లేదా కూర్చోవడానికి సరైన ఆసరా లేకపోవడంతో వేచి చూసే క్రమంలో నేలపైనే పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు కూర్చోవడానికి స్ట్రెచర్లు, మంచాలు సరిపడా అందుబాటులో లేవు.నీరసంతో నేలపై పడుకున్న వృద్ధుడిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:శ్రీదేవి ఆస్తి వివాదం.. బోనీ కపూర్ కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి దుస్థితి నెలకొనడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి మునుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అవసరమైన బెడ్లు, కూర్చునేందుకు కుర్చీలు, కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: మేడ్చల్‌లో మల్లారెడ్డి కోడలు బర్త్‌డే ఫ్లెక్సీల రగడ.. బీఆర్‌ఎస్‌లో ముదిరిన విభేదాలు
