దివంగత నటి శ్రీదేవికి సంబంధించిన ఆస్తి విషయంలో కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న 2.7 ఎకరాల భూమిలో తమకూ హక్కు ఉందని పేర్కొంటూ ఎంసీ శివగామి, ఎంసీ నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పరిశీలించింది.
ఈ వ్యవహారంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో పాటు ఆయన కుమార్తెలు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద భూమికి సంబంధించి తదుపరి విచారణ వరకు ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని ఆదేశించింది.
ఆస్తి వివాదాన్ని కోర్టు వెలుపల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఇరు వర్గాలు పరస్పరం చర్చించుకుని సమస్యకు పరిష్కారం కనుగొనే అవకాశం ఉందని పేర్కొంది.
కేసుపై తదుపరి విచారణను డిసెంబర్ 18కు వాయిదా వేసింది. దీంతో శ్రీదేవి కుటుంబానికి సంబంధించిన ఈ ఆస్తి వివాదం తదుపరి విచారణలో ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
also read: మేడ్చల్‌లో మల్లారెడ్డి కోడలు బర్త్‌డే ఫ్లెక్సీల రగడ.. బీఆర్‌ఎస్‌లో ముదిరిన విభేదాలు
