క్రైమ్ మిర్రర్ : వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గణేశ్ విగ్రహ నిమజ్జనం కోసం చెరువు వద్దకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటన పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. పెద్ద కంజర్లలోని నేరేడు చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు పలువురు వెళ్లారు. ఈ క్రమంలో ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీటిలోకి జారిపోయారు. ఈత రాకపోవడంతో వారు నీటిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆరుగురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో పెద్ద కంజర్ల గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మృతులంతా స్థానికంగా ఉన్న శిరీష చారిటబుల్ ట్రస్ట్లో చదువుతున్న విద్యార్థులుగా సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మృతుల వివరాలు
-
నర్సింహా రాజు – బీటెక్
-
సుమంత్ – డిప్లొమా రెండో సంవత్సరం
-
గణేష్ – డిప్లొమా రెండో సంవత్సరం
-
ఉదయ్ కిరణ్ – డిప్లొమా మూడో సంవత్సరం
-
శ్యాంకుమార్ – డిప్లొమా మొదటి సంవత్సరం
-
సిద్దార్థ్ – పదో తరగతి
