Homeక్రైమ్రమానందన, ఆమె భర్త మధుకర్‌పై మరో బాధితుడి ఆరోపణలు

రమానందన, ఆమె భర్త మధుకర్‌పై మరో బాధితుడి ఆరోపణలు

క్రైమ్ మిర్రర్ : నందూస్ వరల్డ్ వ్యవహారంలో తాజాగా మరో బాధితుడి వీడియో వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి రమానందన, ఆమె భర్త మధుకర్‌పై పలు ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశారు. తమకు జరిగిన అన్యాయంతో పాటు పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించకపోవడం, ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు అందించకుండా ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆరోపించారు.

గతంలో పలువురు బాధితులు తమకు రావాల్సిన డబ్బుల కోసం నందూస్ కిచెన్ వద్దకు వచ్చి యాజమాన్యాన్ని నిలదీసేవారని ఆయన వీడియోలో పేర్కొన్నారు. ఈ వ్యవహారం బయటకు వస్తున్న సమయంలో తప్పించుకునేందుకు రమానందన తన భర్తను రోజంతా టాయిలెట్‌లో దాచిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆరోపించారు.

ఈ దంపతుల వ్యవహార శైలి, బాధ్యతారాహిత్యం కారణంగా తాను సొంత ఉద్యోగాన్ని సైతం కోల్పోవాల్సి వచ్చిందని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన తప్పులకు బాధ్యత వహించకుండా బయట మాత్రం ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తూ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

ఇతరుల నుంచి మోసపూరితంగా డబ్బులు వసూలు చేసి, ఆ సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు మద్దతుగా కాంట్రాక్ట్ పత్రాలు, ఇతర కీలక ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. అవసరమైన సమయంలో ఆ పత్రాలను మీడియా ఎదుట, బాధితుల సమక్షంలో బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సదరు వ్యక్తి స్పష్టం చేశారు. తాజాగా విడుదలైన ఈ వీడియోతో నందూస్ వరల్డ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
also read : సూడాన్‌లో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 60 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు