Homeక్రైమ్చాక్లెట్ తిన్న కొద్దిసేపటికే యువతి మృతి

చాక్లెట్ తిన్న కొద్దిసేపటికే యువతి మృతి

క్రైమ్ మిర్రర్ : విహారయాత్ర కోసం బంధువు, స్నేహితుడితో కలిసి వెళ్లిన ఓ యువతి అనూహ్యంగా మృతి చెందింది. లాడ్జిలో బస చేసిన ఆమె స్నానానికి వెళ్లే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల వర్ష సెప్టెంబర్ 11న తన కజిన్, ఓ స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్లింది. ఈ సందర్భంగా ముగ్గురూ సకలేష్‌పూర్‌లోని ఓ లాడ్జిలో బస చేశారు.

వర్ష స్నానానికి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఓ చాక్లెట్ తిన్నట్లు సమాచారం. అనంతరం బాత్‌రూమ్ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో ఆమెతో పాటు ఉన్నవారు వెంటనే స్పందించినప్పటికీ వర్ష మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. వర్ష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమెతో కలిసి లాడ్జిలో ఉన్న ఇద్దరినీ పోలీసులు విచారించారు.

అయితే వర్ష మృతికి అసలు కారణం ఏమిటనేది ప్రస్తుతం స్పష్టంగా తెలియదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కారణంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
also read ; భార్యపై అనుమానం.. నిద్రలోనే హత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు