Homeసినిమా‘రణబాలి’ షూటింగ్ పూర్తి.. దసరాకు విజయ్ దేవరకొండ, రష్మిక సందడి

‘రణబాలి’ షూటింగ్ పూర్తి.. దసరాకు విజయ్ దేవరకొండ, రష్మిక సందడి

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్‌-ఇండియా చిత్రాల్లో ‘రణబాలి’ ఒకటి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ తాజాగా పూర్తయింది. దీంతో చిత్రబృందం తదుపరి పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది.

‘రణబాలి’ చిత్రానికి ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి విభిన్న కథాంశాలతో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో పాటు భారీ యాక్షన్ అంశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు తెలియజేస్తున్నాయి.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న మరో చిత్రంగా కూడా ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్‌-ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇటీవల విడుదలైన ‘రణబాలి’ టీజర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. టీజర్ యూట్యూబ్‌లో నంబర్‌ వన్ ట్రెండింగ్‌ స్థానాన్ని దక్కించుకున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

షూటింగ్ పూర్తవడంతో సినిమా విడుదలపై అంచనాలు మరింత పెరిగాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను చారిత్రక నేపథ్యంలోని పాత్రల్లో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

also read: బంగారు ఆభరణాలపై మరో భారం.. హాల్‌మార్కింగ్‌ ఛార్జీలు భారీగా పెంపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు