-
తిరుపతి కోర్టులో దావా వేసిన బిజెపి నేత భాను ప్రకాశ్ రెడ్డి
-
హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పిటిషన్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై తిరుపతిలో క్రిమినల్ కేసు నమోదయింది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు , లక్ష్మణుడిని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ అత్యంత హేయమైన, అవమానకరమైన కామెంట్స్ చేశారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, బిజెపి సీనియర్ నేత భాను ప్రకాష్ రెడ్డి తిరుపతిలోని నాలుగవ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు.
Also Read: గులాబీ బాస్ బస్సు యాత్ర…! రాష్ర్ట రాజకీయాల్లో పొలిటికల్ హీట్…
కోట్లాదిమంది హిందూ సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దేవుడిని దొంగలతో పోల్చడం ద్వారా ఉద్దేశపూర్వకంగా ప్రకాష్ రాజ్ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ మేరకు కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.
-
అప్పట్లో కామెంట్స్..
కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. రామలక్ష్మణులు ఉత్తర భారత దేశం నుంచి దక్షిణాదికి వచ్చిన వలస కూలీలని, రావణుడి తోటలో పండ్లను దొంగిలించారంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడడం పై అప్పట్లోనే తీవ్ర దుమారం రేగింది.
Also Read: Tirumala Laddu Update: తిరుమల లడ్డూపై టీటీడీ కీలక నిర్ణయం..!
ఇవి వ్యవహారంపై గతంలోనే తాము ప్రకాష్ రాజ్ కు లీగల్ నోటీసులు పంపిన విషయాన్ని గుర్తు చేశారు భాను ప్రకాష్ రెడ్డి. క్షమాపణలు చెప్పాలని కోరిన ప్రకాష్ రాజ్ కనీసం స్పందించలేదని.. అందుకే చట్టపరమైన న్యాయ పోరాటంలో భాగంగా తిరుపతి కోర్టులో క్రిమినల్ దావా వేసినట్లు భాను ప్రకాష్ రెడ్డి చెప్పారు.
Also Read: కాంగ్రెస్ లో పదవుల పంచాయితీ…!సీనియర్ నేతల్లో అసంతృప్తి….
హిందూ దేవుళ్ళు, సంప్రదాయాలపై సోషల్ మీడియా వేదికగా విషం చిమ్మడం కొందరికి అలవాటుగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని తేల్చి చెప్పారు. కచ్చితంగా ప్రకాష్ రాజును కోర్టు బోను ఎక్కిస్తామని స్పష్టం చేశారు.
-
చిత్ర పరిశ్రమకు ఫిర్యాదు..
కేవలం కోర్టులోనే కాదు చిత్ర పరిశ్రమ పరంగా కూడా చర్యలు తీసుకునేలా ఒత్తిడి పెంచుతామని బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. హిందూ సమాజం ఇస్తున్న ఆదరణతోనే ఆయన నటుడిగా గుర్తింపు సాధించి.. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.
తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలతో పాటు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్స్ కు అధికారికంగా ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పారు. ఇప్పటికే ధర్మస్థల పుణ్యక్షేత్రం పై కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రకాష్ రాజ్. ఇప్పుడు తిరుపతి కోర్టులో కేసు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Also Read: హైదరాబాద్‌లోని ఆ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు..