-
దేశ ప్రగతిలో సింగరేణి ఉద్యోగులే మూల స్తంభాలు
-
నాణ్యమైన ఉత్పత్తులకే మార్కెట్లో మంచి రేటు
మంచిర్యాల , క్రైమ్ మిర్రర్: దేశ ప్రగతిలో సింగరేణి ఉద్యోగులు మూల స్తంభాల లాంటివారని ప్రకృతికి విరుద్ధంగా బొగ్గు బావుల్లో పని చేస్తూ సంపద సృష్టిస్తున్నారని రాష్ట్ర కార్మిక ఉ పాధి కల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకట స్వామి తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల రక్షణకు మరింత పకడ్బందీగా రక్షణ చర్యలు చేపడుతుందని ఉత్పత్తి ఉత్పాదకతలో సిం గరేణి ఉద్యోగులు ముందుంటున్నారని తెలిపారు. గురువారం మందమర్రి ఏరియాలోని కేకేత్ గనిలో మంత్రి దిగారు.
ఈ సందర్భంగా పని 19లేవల్వన్ డీప్ వద్దకు వెళ్లారు.ఉద్యోగులు చేస్తున్న బొగ్గు ఉత్పత్తి పనులను పరిశీలించారు. అనంతరం జీఎం రాధాక్రిష్ణను గనికి సంబంధించినటువంటి వివరాలు అడిగితెలుసుకున్నారు యంత్రాల వివరాలు కూడ అడిగి తెలుసుకున్నారు. గనిలో ఉన్నటువం టి మ్యాప్‌ను పరిశీలించారు ఈ సందర్భంగా గనికి సంబంధించిన వివరాలను జీఎం రాధాక్రిష్ట వివరిం చారు. ఈ సందర్భంగా గనిలో మంత్రి మాట్లాడుతూ గతంలో పోలిస్తే ప్రస్తుతం సింగరేణి సంస్థలో పెను మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు సింగరేణి సంస్థ కూడ అప్డేట్ అవుతుం దన్నారు.
కేకేత్ గనికి రెండు జాతీయ రక్షణ అవార్డులు సాదించిందంటే ఉద్యోగులు అధికారుల సమిష్టి పని విధానం వల్లనే సాధ్యమైందన్నారు. సింగరేణి సిక్ ఇండస్ట్రీగామారిన సమయంలో తన తండ్రి దివంగత కాకా వెం కటస్వామి అప్పటి ప్రభుత్వంతో మాట్లాడి 450 కోట్లకుపైగా మాడిటోరియం ఇప్పించి సంస్థను గటెక్కిం చారన్నారు. లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. అంతేగాకుండా ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ కుటుంబాలు జీవనోపాధికి సంబంధించి పెన్షన్ మంజూరు చేయించిన ఘనత కాకాదే అని తెలి పారు. కేకేత్ గని ఉద్యోగుల పని తీరు బాగుందని ప్రశంసించారు.
గనిలో దిగడం ఉద్యోగులతో కలిసి పని ప్రదేశాలను పరిశీలించడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. ఆయనతో పాటు మున్సిపల్ కమిషనర్ టి. రాజలింగు, తహసీల్దార్ సతీష్ కుమార్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, కేకే1 గ్రూపు ఏజెంటు రాంబాబు, గని మేనేజర్ శంబునాథ్్పండే, తదితరులు పాల్గొన్నారు.