Homeఆంధ్ర ప్రదేశ్వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలకు సీట్లు కట్!

వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలకు సీట్లు కట్!

•పనిచేయని వారి స్థానంలో కొత్త నాయకులు
•ప్రత్యామ్నాయ నాయకత్వం టిడిపిలో రెడీ
•గట్టి హెచ్చరికలు పంపుతున్న అధినేత చంద్రబాబు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో
:-వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రయోగాలు చేయనున్నారా? కొత్త వారి టిక్కెట్లు ఇస్తారా? ప్రస్తుత సిటింగుల పనితీరు బాగాలేదా? అటువంటి వారి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారా? ప్రతి నెల సర్వేలు చేపడుతున్నారా? అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎంపీల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పనితీరు మెరుగుపరుచుకోండి.. లేకుంటే మాత్రం మార్చేస్తాను అని హెచ్చరించారు. తనకు సమాచారం ఉందని.. పనిచేయని నేతలను ప్రోత్సహించే ఛాన్స్ లేదని.. ప్రత్యామ్నాయ నాయకత్వం సిద్ధంగా ఉంది అంటూ అధినేత చేసిన కామెంట్స్ ఇప్పుడు నాయకుల్లో ప్రకంపనలు రేపుతోంది..

ఎమ్మెల్యేల పనితీరుపై ఆరోపణలు..
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. బిజెపి, జనసేనతో కలిపి ఏకపక్ష విజయాన్ని దక్కించుకుంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 135 అసెంబ్లీ స్థానాలు, 16 లోక్సభ సీట్లను గెలుచుకుంది.. గతంలో టిడిపి గెలవని నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీ విజయం సాధించింది. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించాలని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యవహరించాలని చంద్రబాబు పలుమార్లు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు సూచించారు. అయినా సరే చాలామంది వైఖరిలో మార్పు రాలేదు. అందుకే చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా..
కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీల వైఖరి పార్టీకి నష్టం తెస్తోంది. మద్యం, ఇసుక మాఫియాలో చాలామంది ఎమ్మెల్యేలకు హస్తముంది. నిఘవర్గాలతో పాటు సర్వేల్లో కూడా ఇది తెలుస్తోంది. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే ప్రజాదారణ కోల్పోయారు. అటువంటి వారి వివరాలు అధినేత చంద్రబాబు వద్ద ఉన్నాయి. మరోవైపు ఎక్కడైతే ఎమ్మెల్యేలు పై ఆరోపణలు ఉన్నాయో.. అటువంటి చోట మొన్ననే పార్టీ కార్యవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకులకు చోటు కల్పించారు. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానంలో నిలబెట్టేందుకు నాయకులను సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. చాలామంది సొంత వ్యాపారాలు చేసుకుని.. క్యాడర్ తో పాటు ప్రజలను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. అటువంటి వారి విషయంలో కూడా చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మార్పు కోసం ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధంగా ఉంచారు. అయితే ఇప్పటివరకు కేవలం హెచ్చరికలు జారీ చేశారు. ఇకనుంచి వేగంగా చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు