క్రైం మిర్రర్ : రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతుండగా, అతివేగం మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ చౌరస్తా వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామానికి చెందిన మన్నే నర్సింహులు (48) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో నర్సింహులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
also read : మళ్లీ భగ్గుమన్న అమెరికా-ఇరాన్ విభేదాలు.. ఖమేనీ సంచలన వ్యాఖ్యలు