నగరంలో కల్తీ ఆహార దందా రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కఠిన చర్యలు ప్రారంభించింది. కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (H-FAST), జీహెచ్‌ఎంసీ సంయుక్త బృందాలు హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.
బహదూర్‌పురా, కిషన్‌బాగ్, మైలార్‌గడ్డ, మల్కాజ్‌గిరి, బేగంబజార్ ప్రాంతాల్లోని పలు రీప్యాకింగ్ యూనిట్లు, ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలు, బేకరీలు, కిరాణా దుకాణాలను అధికారులు సడెన్‌గా చెక్ చేశారు. ఈ దాడుల్లో ఆహార భద్రతా నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
తనిఖీల్లో బయటపడిన కీలక అంశాలు:
- అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీ
- వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం
- కృత్రిమ రంగులు కలిపి ఆహార పదార్థాల తయారీ
- గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయించడం
- నకిలీ బ్రాండ్ల పేర్లతో సరుకులు అమ్మకం
ఈ ఘటనలకు సంబంధించి ఆరు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దాడుల సమయంలో భారీగా వాడిన నూనె, కృత్రిమ రంగులు, అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న సంస్థలు, సరైన లేబులింగ్ లేని ఉత్పత్తులు విక్రయిస్తున్న వ్యాపారులపై నోటీసులు జారీ చేశారు. అనుమానాస్పద నమూనాలను ప్రయోగశాలకు పంపించారు.
ఈ చర్యలపై డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ, ప్రజారోగ్య రక్షణే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎక్కడైనా కల్తీ ఆహారం లేదా అపరిశుభ్రత కనిపిస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసి అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
also read: ప్రేమ పేరుతో మోసం? నర్సింగ్ అధికారిపై యువతి ఫిర్యాదు.. సంగారెడ్డిలో కేసు నమోదు