తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు భక్తులు ప్రమాదానికి గురయ్యారు. ఆదివారం ఉదయం తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న వారి కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న రక్షణ గోడను ఢీకొని బోల్తా పడింది.
ఈ ఘటనలో ప్రయాణికులందరికీ స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనతో ఆ మార్గంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వాహనాన్ని పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను సవ్యంగా మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఘాట్ రోడ్లలో ప్రయాణించే భక్తులు జాగ్రత్తగా ఉండాలని, వేగ నియంత్రణ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
also read: విశాఖలో విషాదం: వేగంగా దూసుకొచ్చిన కారు- లారీ ఢీ, నలుగురు మృతి