Homeఆంధ్ర ప్రదేశ్జనసేన లో భారీగా చేరికలు...!

జనసేన లో భారీగా చేరికలు…!

  • శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బలమైన నేతలను రప్పించే ఏర్పాట్లు

  • జాయినింగ్స్ కమిటీ నియామకం

  • సమాజంలో తటస్థులను సైతం తిప్పుకునేందుకు వ్యూహం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీయాలని పవన్ భావిస్తున్నారు. అందుకే చేరికలకు రంగం సిద్ధం చేశారు. వివిధ పార్టీల నుంచి నేతల చేరికతో పాటు తటస్తులను ఆకర్షించేందుకు వీలుగా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. 14 మందితో కూడిన ఈ కమిటీ జనసేనలో చేరికలను ప్రోత్సహించనుంది.

Also Read: ‘ఉస్మానియా’లో ర్యాగింగ్…12 మంది సస్పెండ్…! – Crime Mirror

శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జనసేనలో చేరే నేతలతో చర్చించనుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే కీలక నేతలను జనసేనలో చేర్పించేందుకు కసరత్తు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడింది. ఆ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

  • ఢిల్లీ పర్యటన తరువాత..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనతో స్పష్టమైన మార్పు కనిపించింది ఆయన వైఖరిలో. దానికి కారణం లేకపోలేదు. ఏపీలో ఎవరికీ వారుగా మూడు పార్టీలు బలోపేతం చేసుకోవాలని.. అంతిమ లక్ష్యం మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీన పరచాలని బిజెపి పెద్దలు పవన్ కళ్యాణ్ కు హితబోధ చేసినట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు, మున్సిపల్ చైర్మన్ ల తో పాటు నగరపాలక సంస్థ మేయర్ పదవులు భారీగా లభించునున్న దృష్ట్యా పెద్ద ఎత్తున పదవుల పంపకం చేపట్టాలని భావిస్తున్నారు.

Also Read: రేవంత్ రెడ్డి వి చిల్లర వేషాలు…కల్వకుంట్ల కవిత – Crime Mirror

మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ లెక్కన ఏపీలో మరో 80 వరకు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. అందుకే వైసీపీ నేతలను ఆకర్షించడం ద్వారా ఆ పార్టీని దెబ్బ తీయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

  • టార్గెట్ వైసిపి అసంతృప్త నేతలు..

వాస్తవానికి తప్పనిసరి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేతలు ఉన్నారు. అటువంటి వారిని ఆకర్షించేందుకు జనసేన జాయినింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబ వారసులకు అవకాశం కల్పించడం ద్వారా.. వారిని జనసేన వైపు తిప్పుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: హైడ్రాకు షాక్: కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు సీరియస్ – Crime Mirror

రాయలసీమలో సైతం బలమైన రెడ్డి సామాజిక వర్గం పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆ బాధ్యతను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. ఇప్పటికీ ఆయన వైసీపీ కీలక నేతలతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. లింగమనేని రమేష్. ఆయన ద్వారా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి వైసీపీ క్యాడర్ తో పాటు నాయకత్వాన్ని ఆకర్షించే పనిలో ఉన్నారట పవన్.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులను.. సామాజిక సేవలో ఉన్న వారిని జనసేన వైపు రప్పించేందుకు గట్టి ప్రణాళికలు వేస్తున్నారు పవన్. ఈ 14 మందితో కూడిన జాయినింగ్స్ కమిటీకి దిశా నిర్దేశం చేయనున్నారు పవన్. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలినట్టే.

Also Read: జూలై 24న థియేటర్లలోకి కీర్తి సురేష్ ‘సత్యవన్ సావిత్రి’ – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు