-
కేంద్ర మంత్రివర్గంలోకి వేమిరెడ్డి…!
-
గ్రేటర్ రాయలసీమకు ఈసారి ఛాన్స్
-
సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కేంద్ర మంత్రివర్గ విస్తరణ పై జోరుగా ప్రచారం ప్రారంభం అయింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ పై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికల రూట్ మ్యాప్ లో భాగంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read: తెలంగాణ క్యాబినెట్ లోకి విజయశాంతి…!
బిజెపితోపాటు మిత్రపక్షాలకు కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పిస్తారని టాక్ నడుస్తోంది. అందులో భాగంగా ఏపీకి ఒక మంత్రి పదవి ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేంద్ర పెద్దలు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. తప్పకుండా ఏపీకి ఒక మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే మూడు ప్రాంతాల నుంచి..
కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి ముగ్గురు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ హోదాతో కూడిన పౌర విమానయాన శాఖను చూస్తున్నారు. మరోవైపు గోదావరి జిల్లాలకు చెందిన బిజెపి ఎంపి భూపతిరాజు శ్రీనివాస వర్మ సైతం సహాయ మంత్రిగా ఉన్నారు.
Also Read: సిగరెట్ కన్నా అగరబత్తి పొగ ఆరోగ్యానికి హానికరమా…?
గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్వతంత్ర హోదా తో కూడిన క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, కోస్తాంధ్రలకు కేంద్ర క్యాబినెట్లో స్థానం ఉంది. గ్రేటర్ రాయలసీమ నుంచి మాత్రం ఎవరికీ ఛాన్స్ లేదు. అందుకే ఈసారి గ్రేటర్ రాయలసీమకు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కడం ఖాయమని తెలుస్తోంది. ప్రముఖంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు వినిపిస్తోంది.
వైసీపీకి పట్టున్న జిల్లా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. 2024 లో మాత్రం కూటమి గెలుపు వన్ సైడ్ అన్నట్టు మారింది. దానికి కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
Also Read: సారూ..నన్ను నా కొడుకు నుంచి రక్షించండి…! వృద్దురాలి కన్నీటి వినతి…..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడిగా కొనసాగుతూ వచ్చిన వేమిరెడ్డి.. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా క్యాడర్ను టిడిపి వైపు టర్న్ చేయడంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాత్ర ఉంది. అందుకే వేమిరెడ్డికి ఎంతగానో ప్రాధాన్యమిస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం వేమిరెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
అయితే ఆ దంపతుల్లో ఒకరికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. అయితే గ్రేటర్ రాయలసీమకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దాక్కాలంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Also Read: త్రిష రెమ్యునరేషన్ వింటే దిమ్మ తిరగాల్సిందే బాబు..!