Homeరాజకీయంఇండియా కూటమి బలోపేతం

ఇండియా కూటమి బలోపేతం

*కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేసేందుకు బలమైన ప్రాంతీయ పార్టీలు సిద్ధం
*బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఓటమి అసలైన లక్ష్యం
*ఏకతాటిపైకి ప్రాంతీయ పార్టీల నేతలు

క్రైమ్ మిర్రర్, ఢిల్లీ:- రాజకీయాల్లో అవసరాలు మాత్రమే పనిచేస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరిస్తారు నేతలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తారు. ఇప్పుడు జాతీయస్థాయిలో చాలా రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రిలకు ఇదే పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కు వ్యతిరేకంగా నేతలంతా ఒకే పార్టీ పైకి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ ప్రధమ ప్రత్యర్థి కాంగ్రెస్. అయితే అటు తరువాత చాలా ప్రాంతీయ పార్టీలను కబళిస్తూ వచ్చింది బిజెపి. దేశంలో మెజారిటీ ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగానే ఉన్నాయి. అయితే అలాగని ఆ పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరలేదు. కానీ ఇప్పుడు బీజేపీ హవాను తట్టుకోవాలి అంటే ఆ పార్టీలన్నీ ఇప్పుడు ఇండియా కూటమి వైపు వెళ్లాల్సిందే.

ప్రతి రాష్ట్రంలోనూ ఓటమి..
ప్రతి రాష్ట్రం లోనూ ప్రాంతీయ పార్టీలను ఓడించి అధికారంలోకి వస్తోంది భారతీయ జనతా పార్టీ. ఈ జాబితా చూస్తే చాలా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శివసేన ఉద్దవ్ ఠాక్రే, నవీన్ పట్నాయక్, కెసిఆర్, అఖిలేష్ యాదవ్, వైయస్ జగన్మోహన్ రెడ్డి, స్టాలిన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాంతీయ పార్టీల అధినేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని తట్టుకోవడం ఎలా అని ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ చూస్తే స్వల్ప బలం పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. అందుకే ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిని బలోపేతం చేస్తే మంచి ఫలితం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు సంవత్సరాల సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇండియా కూటమిని బలోపేతం చేస్తే ఎన్డీఏ ను అధికారం నుంచి దూరం చేయవచ్చు అనేది ఒక అంచనా.

కాంగ్రెస్ కు జై కొట్టక తప్పదు
ప్రాంతీయ పార్టీలు సహజంగానే జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని సహించవు. ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పుట్టుకొచ్చింది. దానికి కాంగ్రెస్ నేతృత్వం వహించింది. అది ఎంత మాత్రం ప్రాంతీయ పార్టీలకు మింగుడు పడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ దేశంలో బలహీన పడింది. ఆ పార్టీ కంటే బలంగా ఉన్నామన్న అభిప్రాయం ప్రాంతీయ పార్టీల్లో ఉండేది. అందుకే ఇండియా కూటమి ఐక్యంగా ముందుకు సాగలేకపోయింది. అయితే దేశంలో పేరు మోసిన దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఆ పార్టీల నేతలు ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో పనిచేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా మమతా బెనర్జీ ఓడిపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీతో రాజీ పడక తప్పదు. ఇండియా కూటమికి కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి కూడా మిగతా రాజకీయ పార్టీలకు ఏర్పడింది. మున్ముందు ఇండియా కూటమి మరింత బలపడే ఛాన్స్ కనిపిస్తోంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు