Homeఆంధ్ర ప్రదేశ్షర్మిల పాదయాత్ర!

షర్మిల పాదయాత్ర!

*రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల్లో చేసేందుకు సన్నాహాలు
*మిగతా ప్రాంతాల్లో మాత్రం బస్సుయాత్ర
*కాంగ్రెస్ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పాదయాత్రకు సిద్ధపడుతున్నారా? అయితే ఇది అన్ని ప్రాంతాల్లో కాదా? కేవలం రాయలసీమకి ఆమె పాదయాత్ర పరిమితం కానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. రాయలసీమకు అతి దగ్గరగా ఉండే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో కాంగ్రెస్ సహకారంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటయింది. తెలంగాణలో రేవంత్ రూపంలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. ఈ మూడు రాష్ట్రాల సహకారంతో రాయలసీమపై గట్టి ప్లాన్ చేస్తున్నారు షర్మిల.

జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా..
రాయలసీమపై వైయస్సార్ కుటుంబ ప్రభావం అధికంగా ఉండేది. ముఖ్యంగా కడప జిల్లాలో ఆ కుటుంబానికి తిరుగులేని రాజకీయ ఆధిపత్యం. కానీ మొన్నటి ఎన్నికల్లో ఆ ప్రభావం పనిచేయలేదు. జగన్మోహన్ రెడ్డి దారుణంగా దెబ్బతిన్నారు. అందుకే కడప జిల్లాతో పాటు రాయలసీమపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందుకే షర్మిల సైతం ఆ ప్రాంతంపై పట్టు బిగించేందుకు పాదయాత్రకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర చేయాలని ఆమె స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో ఆమె పాదయాత్ర ఉంటుందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది.

వెంటనే బస్సు యాత్ర..
మరోవైపు కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్రలో షర్మిల బస్సు యాత్రకు సైతం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో పాదయాత్ర ముగిసిన వెంటనే బస్సు యాత్రకు సన్నాహాలు మొదలు పెడతారని సమాచారం. కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేసే విధంగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే విధంగా ఆమె పావులు కదుపుతున్నట్లు అర్థమవుతుంది. అన్నింటికీ మించి వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పాటు మిగతా రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకుంటుంది జాతీయస్థాయిలో. ఇదే ఊపుతో రాయలసీమలో పట్టు బిగించడం ద్వారా.. 2029 ఎన్నికల్లో ఓట్లతో పాటు సీట్లు కూడా పొందాలని చూస్తోంది కాంగ్రెస్. అందుకే షర్మిల పాదయాత్రకు హై కమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు